బిజినెస్

పోస్టల్ పేమెంట్ బ్యాంక్ త్వరలోనే ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, సెప్టెంబర్ 23: ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర తపాలా శాఖ కార్యదర్శి బివి సుధాకర్ తెలిపారు. సింహాచలం వచ్చిన సందర్భంగా శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి ఒక లక్షా ఏభైవేల పోస్ట్ఫాసుల్లో అన్‌లైన్ సేవలందించేందుకు నెట్‌వర్కింగ్ పూర్తయిందన్నారు. తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం గ్రామీణ డాక్ సేవక్ పేరుతో ఆన్‌లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని, దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ దశలో ఉందన్నారు. సెప్టెంబర్ 12న ఇండియన్ పోస్టల్ హెల్త్ సెంటర్ ప్రారంభించామన్నారు. 1924 నెంబర్‌కి ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తారన్నారు. ఆన్‌లైన్ నెట్‌వర్క్ సమస్యల పరిష్కారం కోసం ట్విట్టర్ పోస్టల్ డాట్ కామ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. తపాలా శాఖలో ఇడి విధానంలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఇడి పేరుతో కమిటీని నియమించామని, ఈకమిటీ పూర్తిస్థాయిలో సమస్యను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాక చర్యలు తీసుకుంటామన్నారు.