బిజినెస్

సహారాకు చెందిన 13 ఆస్తులకు వచ్చే నెలలో సెబీ వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సహారా గ్రూపు సంస్థల నుంచి డబ్బును రికవరీ చేసేందుకు ఆ సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్న మార్కెట్ నియంత్రణా సంస్థ ‘సెబీ’ ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ సంస్థకు చెందిన మరో 13 ల్యాండ్ పార్శిళ్లను వచ్చే నెలలో వేలం వేయబోతున్నామని, వీటి మొత్తం రిజర్వు ధరను దాదాపు 1,400 కోట్ల రూపాయలు నిర్ణయించడం జరిగిందని సెబీ స్పష్టం చేసింది. గత జూలైలో వేలం వేయాల్సి ఉన్న 58 ఆస్తులకు అదనంగా వచ్చే నెలలో మరో 13 ఆస్తులను వేలం వేయబోతున్నామని, ఈ ఆస్తులన్నింటి రిజర్వు ధర దాదాపు 5 వేల కోట్ల రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని సెబీ పేర్కొంది. సహారా గ్రూపునకు చెందిన ఆరు ఆస్తులను రూ.672 కోట్లకు పైగా రిజర్వు ధరతో ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్‌బిఐ క్యాప్) అక్టోబర్ 25వ తేదీన వేలం వేస్తుందని, అలాగే మరో ఏడు ఆస్తులను రూ.710 కోట్లకు పైగా రిజర్వు ధరతో హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీ అక్టోబర్ 27వ తేదీన వేలం వేస్తుందని బుధవారం విడివిడిగా జారీ చేసిన నోటీసుల్లో సెబీ తెలిపింది. సహారా గ్రూపు నుంచి రావలసిన సొమ్మును రికవరీ చేసేందుకు కొన్ని ఆస్తులను అమ్మాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో సెబీ ఆ సంస్థకు చెందిన మొత్తం 61 ఆస్తులను వేలం వేసే పనిని ఎస్‌బిఐ క్యాప్, హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీ సంస్థలకు అప్పగించిన విషయం తెలిసిందే. వీటిలో 31 ఆస్తులను రూ.2,400 కోట్ల రిజర్వు ధరతో హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీ వేలం వేయనుండగా, మిగిలిన 30 ఆస్తులను దాదాపు రూ.4,100 కోట్ల రిజర్వు ధరతో ఎస్‌బిఐ క్యాప్ వేలం వేయనుంది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ ఆస్తుల్లో ఎక్కువ భాగం భూములే ఉన్నాయి. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఆస్తులను ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ రేట్లలో 90 శాతం కంటే తక్కువ ధరకు అమ్మేందుకు వీల్లేదు.
మూడు సంస్థల ఖాతాల
జప్తునకు సెబీ ఆదేశం
ఇదిలావుంటే, సూపర్ గ్రీన్ (ఇండియా), అభినవ్ కమర్షియల్, షామ్‌కెన్ మల్ట్ఫ్యీబ్ సంస్థల నుంచి దాదాపు 6 లక్షల రూపాయిల బకాయిలను వసూలు చేసేందుకు ఆ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలతో పాటు డీమ్యాట్ ఖాతాలను జప్తు చేయాలని సెబీ ఆదేశించింది. ఈ మూడు సంస్థలకు విధించిన జరిమానా, వడ్డీలు, ఇతర చార్జీలు ఈ బకాయిల్లో ఉన్నాయి.