బిజినెస్

అమ్మకానికి ‘రాజీవ్ స్వగృహ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారంగా మారిన రాజీవ్ సృగృహ ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి విక్రయానికి విధివిధానాలను ఖరారు చేయడానికి గృహ నిర్మాణ శాఖకు ఇన్‌చార్జిగా ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో మంగళవారం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను సభ్యులుగా నియమించింది. ఇటీవల జరిగిన రాష్టమ్రంత్రి మండలి సమావేశంలో రాజీవ్ స్వగృహ ఇళ్లను విక్రయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిరర్థక ఆస్తులను విక్రయించి ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ భూముల విక్రయంతో పాటు రాజీవ్ సృగృహ ఇళ్లను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చోకోనున్నట్టు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మీడియాకు వెల్లడించిన విషయం
తెలిసిందే. ఇలాఉండగా మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వమే అపార్టుమెంట్లు నిర్మించాలన్న లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ సృగృహ పథకం కింద రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారం వద్ద రెండు భారీ ప్రాజెక్టులను 2008లో చేపట్టి 2011లో పూర్తిచేసింది. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,621.26 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే మార్కెట్ ధర కంటే రాజీవ్ సృగృహ ఇళ్లకు ఖరారు చేసిన రేట్లు ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నిర్మాణం పూర్తయినా కొనుగోలు చేసేవారు లేక అలాగే ఉండిపోయాయి. దీంతో వీటి నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు వడ్డీలు తడిసి మోపడయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలు, వాటికి అయిన వడ్డీతో సహా రూ.1,071.39 కోట్లు చెల్లించింది. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన రాజీవ్ సృగృహ ఇళ్లపై పెట్టిన వ్యయం ప్రభుత్వానికి గుదిబండగా మారడంతో వీటిని తమకు తక్కువ ధరకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభాపేక్ష లేకుండా ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సేల్’ ప్రాతిపదికన విక్రయించాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాలతో గృహ నిర్మాణ శాఖ అధికారులు సమావేశమై చర్చించారు. బండ్లగూడ ప్రాజెక్టులో నిర్మాణం పూర్తయిన రాజీవ్ స్వగృహ ప్లాట్లకు చదరపు అంగుళానికి రూ.1,900, అసంపూర్తిగా ఉన్న వాటికి చదరపు అంగుళానికి రూ.1,500, పోచారం ప్రాజెక్టులో పూర్తయిన ప్లాట్లకు రూ.1,700, అసంపూర్తిగా ఉన్న వాటికి రూ.1,500గా గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన రేట్ల పట్ల ఉద్యోగ సంఘాలు సమ్మతించలేదు. ఎప్పుడో పుష్కరం కాలం కిందట నిర్మించిన పాత ఇళ్లకు ఈ రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు కొనుగోలు చేయడానికి అంగీకరించలేదు. దీంతో రేట్లు తగ్గించే అంశం తమ పరిధిలో లేదని గృహ నిర్మాణ శాఖ తేల్చిచెప్పింది. దీంతో నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో 2017 నుంచి రాజీవ్ స్వగృహ ఇళ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయాయి. అంతలోనే ముందస్తు ఎన్నికలు, ఆ తర్వాత వరుస ఎన్నికలతో ఈ అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వ నిరర్థక ఆస్తులను విక్రయించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులు కోరుతున్న రేట్లు, ప్రభుత్వం ప్రతిపాదించిన రేట్లపై పునరాలోచన చేసి తాజాగా ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. బండ్లగూడ రాజీవ్ సృగృహ ప్రాజెక్టులో నిర్మాణం పూర్తయిన 309 ప్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 1,931 ప్లాట్లు, పోచారం ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉన్న 954 ప్లాట్లు, పూర్తయిన 1,650 ప్లాట్లను ఉద్యోగులకు సరసమైన రేట్లకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఖరారు చేసే రేట్లకు ఉద్యోగులు అంగీకరిస్తే ప్రభుత్వానికి గుది బండగా మారిన రాజీవ్ స్వగృహ ఇళ్ల సమస్య పరిష్కారం అవుతుంది.