బిజినెస్

రాష్ట్రంలో కెనడా పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కెనడా ముందుకొచ్చింది. స్మార్ట్ సిటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్, ఇతర ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. విద్య, వైద్యం,
వ్యవసాయ రంగాలపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ, చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి ఆ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ, ఫార్మా రంగాలపై ఆసక్తి కనబరిచారు. భారత్, కెనడాల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వాణిజ్యాన్ని పెంపొందించుకోవటంతో పాటు వాతావరణ మార్పుల అంశంలో ఇప్పటికే కలిసి పనిచేస్తున్నట్లు గిరార్డ్ తెలిపారు. భారత్‌తో పాటు ఏపీతో తమ బంధాన్ని మరింత దృఢం చేసుకునేందుకు వివిధ రంగాల్లో అవకాశాలను పరిశీలిస్తున్నామని, ఆ మేరకు వ్యాపార సంబంధాల మెరుగుదలకు, పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ, కెనడాలో ప్రభావ వంతమైన నాయకత్వం ఇందుకు దోహదపడగలదని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై తమ వద్ద సమాచారం ఉందన్నారు. దేశంలో, రాష్ట్రంలో సంస్థాగత, ప్రత్యక్ష పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు గిరార్డ్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలే ప్రాధాన్యతగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. గత 9 నెలల కాలంలో చేపట్టిన పథకాలను గుర్తుచేశారు. పేదరికం అనేది చదువుకు అడ్డు రాకుండా పిల్లలను బడికి పంపేలా తల్లుల్ని ప్రోత్సహించేందుకు అమ్మఒడిని అమలు చేస్తున్నామని, నాడు- నేడు కార్యక్రమాలతో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్నట్లు తెలిపారు. అంతిమంగా నిరక్షరాస్యత నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. జీఈఆర్ నిష్పత్తి శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలను ఈ సందర్భంగా ఉదహరించారు. అమ్మఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరటం చాలా మంచి కార్యక్రమమని గిరార్డ్ ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను, సర్వీస్‌లను డోర్ డెలవరీ చేసేందుకు గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థల ద్వారా తీసుకొచ్చిన మార్పులను సీఎం వివరించారు. అవినీతి, పక్షపాతం లేకుండా పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఇంగ్లీష్ మీడియంలో బోధనతో పాఠశాలల్లో చక్కటి వాతావరణాన్ని కల్పించాలనే ధ్యేయంతో తమ ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా పనిచేస్తోందన్నారు. రానున్న రెండేళ్లలో గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రుల్లో నాడు- నేడు, రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా 24 గంటల వైద్య సేవలు ఇవన్నీ పెనుమార్పులకు నాంది పలుకుతాయని చెప్పారు. ఉన్నత చదువులు, ఆరోగ్యం కోసం కుటుంబాలు అప్పుల్లో కూరుకు పోతున్నాయని, విద్య, ఆరోగ్యం కోసం ఎవరూ ఈ ఊబిలో చిక్కుకోకుండా ప్రభుత్వం తరుపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల పనితీరును వివరించారు. రాష్ట్రంలో టైర్-1 సిటీ లేదని, అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. వచ్చే పదేళ్లలో హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడే విధంగా విశాఖను తీర్చి దిద్దుతామన్నారు. ఐటీ, అత్యాధునిక టెక్నాలజీ అభివృద్ధికి విశాఖతో పాటు సెంట్రల్ ఆంధ్ర, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. సాగునీటి రంగంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. రాయలసీమ ప్రాంతంలో కరవు నివారణ చర్యలతో పాటు గోదావరిలో వృధాగా పోతున్న సముద్రపు జలాలను కృష్ణానదికి తరలించే భారీ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరుగుతోందని తెలిపారు. సమావేశంలో గిరార్డ్‌తో పాటు కెనడా కాన్సుల్ సీనియర్ ట్రేడ్ కమిషనర్ మార్క్‌ప్రోటర్, ట్రేడ్ కమిషనర్ విక్రం జైన్ తదితరులు ఉన్నారు.

*చిత్రం... ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో సమావేశమైన కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్