బిజినెస్

17 అసంతృప్త అంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: ఇన్ఫోసిస్ డిజైన్ చేసిన జీఎస్‌టీ నెట్‌వర్క్‌లో 17 అసంతృప్త అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. జమ్మూకాశ్మీర్‌లో పన్ను చెల్లింపుదారులు మార్పుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం, ఆధార్ తనిఖీ, సర్వర్ విస్తరణ కొరత వంటి సమస్యలు కూడా వీటిలో ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించిన ఇతర అంశాలలో జీఎస్‌టీఆర్-3బీ దాఖలు చేయని వారికి ఈ-వే బిల్లు తయారు కాకుండా నిరోధించే సాఫ్ట్‌వేర్‌ను అందించడంలో ఆలస్యం చేయడం వంటి ఇన్ఫోసిస్ పరిష్కరించని, పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నవి ఉన్నాయి. భారతదేశం వెలుపల పాయింట్ ఆఫ్ సేల్ కోసం కొత్త సప్లై కోడ్, గతంలో తిరస్కరణకు గురయిన వాటి విషయంలో అదే ఇలాకాకు చెందిన అధికారికి రిజిస్ట్రేషన్ దరఖాస్తును అప్పగించడానికి వీలు కల్పించే ఫీచర్‌ను రూపొందించడం వంటి అంశాలు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించిన వాటిలో ఉన్నాయి. ఇన్ఫోసిస్.. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) బ్యాకెండ్‌ను నిర్వహించే కాంట్రాక్టును 2015లో పొందింది. అయితే, జీఎస్‌టీఎన్ నెట్‌వర్క్‌లో ఇప్పటికీ సాంకేతిక పరమయిన అవాంతరాలు ఎదురవుతుండటం, సుమారు రెండేళ్లయినా వాటిలో కొన్ని ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇన్ఫోసిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సాంకేతికపరమయిన అవాంతరాలను అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించిందని, వీటిలో 17 అంశాలను నొక్కి చెప్పిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ అంశాలపై ఇన్ఫోసిస్‌కు ఒక ఈ-మెయిల్ పంపించింది. అయితే, ఆ ఈ-మెయిల్‌లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నత స్థాయి సమావేశాలు జరిగిన తరువాత ప్రభుత్వం.. ఈనెల 14న జరిగే జీఎస్‌టీ మండలి సమావేశం కావడానికి ముందు ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి రావలసిందిగా ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకనిని ఆదేశించింది.
జీఎస్టీ చట్టంలో మార్పులు?
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టంలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. సెల్‌ఫోన్లు, పాదరక్షలు, దుస్తులకు సంబంధించిన ఉత్పత్తులపై పన్నును కొంతమేర తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. జీఎస్టీ ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కౌన్సిల్14న సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ నెట్‌వర్క్ పోర్టల్ అంశాన్ని చర్చించి, ఇన్ఫోసిస్ నుంచి పరిష్కార మార్గాలను కోరే విషయాన్ని కూడా పరిశీలిస్తారు. జీఎస్టీ అమలు, ఈ వేబిల్ విధానం, జీఎస్టీ ద్వారా నమోదు చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం, లాటరీ విధానాన్ని అమలు చేయడం వంటి పలు కీలక అంశాలు కూడా చర్చకు వస్తాయని అంటున్నారు. ఏప్రిల్ 1నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాంద్య పరిస్థితులను ఎదుర్కోవడానికి, స్థూల జాతీయోత్పత్తిని పెంచడానికి పలు చర్యలను చేపడుతున్నట్టు సీతారామన్ ఇదివరకే ప్రకటించారు. ఆ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సిల్ సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులతో చర్చిస్తారు. ఆ తర్వాతే కేంద్రం నుంచి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.