బిజినెస్

ఎగుమతుల సబ్సిడీలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వ్యవసాయ ఎగుమతులకు సంబంధించిన రాయితీలను రద్దు చేసేందుకు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వ్యవసాయ మంత్రులు శుక్రవారం ఆమోదం తెలిపారు. కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) సభ్య దేశాల మంత్రుల సమావేశంలో కుదిరిన అంగీకారం మేరకు సురక్షితమైన, దీర్ఘకాలిక వ్యవసాయ వాణిజ్య విధానాల అమలుకు కట్టుబడి ఉంటామని ఉద్ఘాటిస్తూ ఈ సబ్సిడీల రద్దుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే శానిటరీ, ఫైటోశానిటరీ సమస్యలపై జరిపే చర్చల్లో శాస్ర్తియ సూత్రాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వీరు వక్కాణించారు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యాన్ని పెంపొందించడంలో అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థకున్న ప్రాధాన్యతను గుర్తించామని, కెన్యా రాజధాని నైరోబీలో ప్రపంచ వాణిజ్య సంస్థ గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన 10వ మంత్రుల స్థాయి సమావేశం చేసిన తీర్మానాలను, ప్రత్యేకించి వ్యవసాయ ఎగుమతులకు సంబంధించిన సబ్సిడీలను రద్దు చేయాలన్న అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని న్యూఢిల్లీలో శుక్రవారం వ్యవసాయ మంత్రుల 6వ సమావేశం ముగిసిన తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో బ్రిక్స్ దేశాలు స్పష్టం చేశాయి. నశ్వర ఆహార వాణిజ్యానికి సంబంధించిన వాణిజ్య వెసులుబాటు ఒప్పందాన్ని (టిఎఫ్‌ఎ) ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నామని బ్రిక్స్ దేశాలు ఈ ప్రకటనలో పేర్కొన్నాయి. నిర్దేశిత గడువులోగా వ్యవసాయ ఎగుమతులకు సంబంధించిన సబ్సిడీలను రద్దు చేయాలని నైరోబీలో జరిగిన సమావేశంలో డబ్ల్యుటిఓ సభ్య దేశాలు అంగీకరానికి రాగా, వాణిజ్య అవరోధాలను తొలగించుకునేందుకు వీలుగా టిఎఫ్‌ఎని ఆమోదించాలని మూడేళ్ల క్రితం బాలీలో జరిగిన సమావేశంలో సభ్య దేశాలు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే.
బ్రిక్స్ సభ్య దేశాల్లో పప్పు్ధన్యాల సాగును పెంపొందించడంతో పెంపొందించడంతో పాటు పౌష్ఠికాహారంలో పప్పులకు గల ప్రాధాన్యతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కూడా వ్యవసాయ మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతున్నందున ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలిగే వ్యవసాయ సాంకేతిక పద్దతులను ప్రోత్సహించడంతో పాటు నిరంతరం సమాచారాన్ని, అనుభవాలను పంచుకోవడం ద్వారా బ్రిక్స్ సభ్య దేశాలు వ్యవసాయ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సమావేశం అభిప్రాయపడింది.
పప్పుల కొరతను అధిగమించేందుకు
సహకరించాలి : భారత్ విజ్ఞప్తి
ఇదిలావుంటే, రెండేళ్ల నుంచి పప్పు్ధన్యాలు, నూనె గింజల దిగుబడి తగ్గడంతో ఇబ్బందులు పడుతున్న భారత్, దేశీయంగా వీటి కొరతను అధిగమించేందుకు బ్రిక్స్ సభ్య దేశాలు సహకరించాలని కోరింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ శుక్రవారం బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు.

చిత్రం.. శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమైన బ్రిక్స్ దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు