బిజినెస్

ఎస్ బ్యాంక్‌లో 49 శాతం వాటాలకు ఎస్బీఐ పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 12: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్‌ను ఒడ్డుకు చేర్చేందుకు ఎస్బీఐ నడుం బిగించింది. 7,250 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా ఆ బ్యాంక్ 49 శాతం ఈక్విటీ వాటాలను ఎస్బీఐ సొంతం చేసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రకటించిన రెస్క్యూ ప్లాన్‌లో భాగంగానే ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 11వ తేదీన సమావేశమైన బ్యాంక్ పాలక మండలి పెట్టుబడుల తీర్మానానికి ఆమోద ముద్ర వేసింది. ఒకొక్కటి 10 రూపాయల విలువైన 725 కోట్ల షేర్లను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించింది. స్టాక్ మార్కెట్ నియమ నిబంధనలను అనుసరించి, సెబీ ఆమోదం తెలిపిన తర్వాతే ఎస్బీఐ పాలక మండలి నిర్ణయం అమల్లోకి వస్తుంది. మొదట్లో 2,450 కోట్ల రూపాయల పెట్టుబడికి ఎస్బీఐ ముందుకొచ్చింది. 245 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాలని అనుకుంది. అయితే, ఆ మొత్తాన్ని పెంచింది. ఇతర పెట్టుబడిదారులతో కలిసి ముందుకు వెళ్లేందుకు వీలుగా ప్రైవేటు సంస్థల్లో ఎస్బీఐ పెట్టుబడి 10,000 కోట్ల రూపాయలకు మించకూడదు. ఈనెల 5వ తేదీన ఎస్ బ్యాంక్ ఖాతాదారుల విత్‌డ్రాయల్స్‌పై ఆర్బీఐ పరిమితిని విధించింది. 50,000 రూపాయలకు మించి విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. దీనితో దేశ వ్యాప్తంగా ఎస్బీఐ డిపాజిట్‌దారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారి సొమ్ము భద్రంగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినప్పటికీ, పరిస్థితి ఆశాజనకంగా కనిపించలేదు. అయితే, ఆమె ఆర్బీఐ ఉన్నతాధికారులతో సమావేశమైనప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్బీఐ ఉన్నతాధికారులతోనూ ఆమె భేటీ అయ్యారు. ఈ రెండు కీలక సమావేశాల అనంతరం ఎస్ బ్యాంక్‌లో భారీ పెట్టుబడులకు ఎస్బీఐ ముందుకొచ్చింది. ఈ చర్యలతో ఎస్ బ్యాంక్ కష్టాలు తీరి మళ్లీ గాడిలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.