బిజినెస్

భారీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: భారత్‌కే పరిమితం కాకుండా యావత్ ప్రపంచంలోనూ అన్ని రంగాలపై కరోనా వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. భారీ నష్టాలతో వివిధ రంగాలు అల్లాడుతున్నాయి. గత వారం భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. దేశంలోని పది పెద్ద కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 4,22,393.44 కోట్ల రూపాయలు పతనమైంది. భారీ నష్టాలను చవిచూసిన కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయమ్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ మొత్తం 3,473.14 పాయింట్లు (9.24 శాతం) నష్టపోయింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో, వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీల షేర్లను అమ్మడానికే మదుపరులు ఆసక్తి ప్రదర్శించారు. గురువారం నాటి భారీ నష్టం తర్వాత, భారీగా పతనమైన స్టాక్ మార్కెట్ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కొంత మంది మదుపరులు ప్రయత్నించడంతో, మార్కెట్లు నష్టాల బారి నుంచి కొంత వరకూ గట్టెక్కాయి. కానీ స్థూలంగా చూస్తే మాత్రం టాప్ 10 కంపెనీల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. టీసీఎస్ విలువ 1,16,549.07 కోట్ల రూపాయలు తగ్గడంతో, 6,78,168.49 కోట్లకు పడిపోయింది. రిల్ విలువ 1,03,425.15 కోట్లు తగ్గడంతో 7,01,693.52 కోట్ల రూపాయల వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 41,315.98 కోట్ల రూపాయలు పడిపోయి, 2,73,505.62 కోట్ల రూపాయలుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ 34,919.51 కోట్ల రూపాయలు తగ్గి, 5,87,190.43 కోట్లకు పడిపోయింది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) విలువ 33,208.35 కోట్ల రూపాయలు తగ్గడంతో, 4,40,151.42 కోట్ల రూపాయలకు పతనమైంది. కోటక్ మహీంద్ర బ్యాంక్ విలువ 30,931.10 కోట్లు తగ్గడంతో, 2,81,237.76 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ 25,098.54 కోట్ల రూపాయలు పడిపోయి, 289,606.69 కోట్ల రూపాయల వద్ద స్థిరపడింది. అదే విధంగా బజాజ్ ఫైనాన్స్ విలువ 16,320.81 కోట్ల రూపాయలు పతనమై, 2,37,989.09 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. భారతి ఎయిర్‌టెల్‌కు కూడా పతనం తప్పలేదు. ఆ కంపెనీ మార్కెట్ విలువ 13,611.62 కోట్లు నష్టపోయి, 2,69,613.64 కోట్ల రూపాయలుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ 7,013.31 కోట్ల నష్టంతో 3,58,201.28 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇలావుంటే, టాప్-10 కంపెనీల్లో రిల్ కంపెనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆతర్వాతి స్థానాలను వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ ఆక్రమించాయి.