బిజినెస్

కృష్ణన్, మార్షల్‌లను అరెస్టు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందం కేసులో నిందితులయిన మలేసియా జాతీయులు టి.ఆనంద కృష్ణన్, ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్‌లను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశిస్తూ 2జి స్పెక్ట్రం కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు శనివారం వారెంట్లు జారీ చేసింది.
ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధితో పాటు వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో మలేసియాకు చెందిన కృష్ణన్, మార్షల్‌తో పాటు రెండు సంస్థలు- ఆస్ట్రో ఆల్ ఆసియా నెట్‌వర్క్ పిఎల్‌సి, మాక్సిస్ కమ్యూనికేషన్ బెర్హాడ్- కోర్టులో హాజరు కావడానికి దీర్ఘకాలం పడుతుందని పేర్కొంటూ, విచారణలో జాప్యాన్ని నివారించడానికి వారినుంచి మారన్ సోదరులను, మెస్సర్స్ సన్ డైరెక్ట్ టివి ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ సౌత్ ఆసియా ఎంటర్‌టెయిన్‌మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌ల విచారణను వేరు చేయాలని కూడా ప్రత్యేక న్యాయమూర్తి ఒపి షైనీ ఆదేశించారు.
కేసు దర్యాప్తుకు హాజరు కావాలని ఆదేశిస్తూ మలేసియాకు చెందిన ఇద్దరు నిందితులు కృష్ణన్, మార్షల్‌లకు పంపించిన సమన్లు వారికి అందడం లేదని, అందువల్ల వారి అరెస్టుకు వారెంట్లు జారీ చేయాలని దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఆగస్టు ఒకటో తేదీన చేసిన విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు శనివారం ఈ ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ ఈ కేసులో నలుగురు వ్యక్తులు, నాలుగు సంస్థలను భారత శిక్షాస్మృతి (ఐపిసి), అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసింది.