బిజినెస్

భారీ పతనం తప్పినప్పటికీ మార్కెట్లకు నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 17: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల మాదిరిగానే భారత స్టాక్ మార్కెట్లను కూడా కరోనా వరస్ భయం వెంటాడుతున్నది. ఫలితంగా ఈవారం వరుసగా రెండో రోజు కూడా నష్టాలు తప్పలేదు. సోమవారం నాటి ట్రేడింగ్‌తో పోలిస్తే భారీ పతనం తప్పినప్పటికీ, మార్కెట్లు కుదుటపడలేదు. తీవ్రమైన అనిశ్చితిలో కొట్టుమిట్టాడిన సూచీలు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్ 810.98 పాయింట్లు (2.58 శాతం) పతనమై 30,579.09 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 230.35 పాయింట్లు (2.50 శాతం) నష్టపోయి 8,967.05 పాయింట్ల దిగువన ముగిసింది. సోమవారం సెనె్సక్స్ 2,713.41 పాయింట్లు నష్టపోవడంతో, మంగళవారం నాటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. కానీ, అందుకు భిన్నంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్ సానుకూల ధోరణుల మధ్య ప్రారంభమైంది. లావాదేవీల్లో ఎక్కువ సమయం సూచీలు లాభాల్లోనే కనిపించాయి. కానీ, చివరి గంటలో ఎవరూ ఊహించని రీతిలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అప్పటికే అనూహ్యంగా పతనమైన కంపెనీల షెర్లను తక్కువ ధరకే తీసుకోవచ్చన్న మదుపరుల ఆలోచన అమ్మకాల జోరును పెంచింది. ఒక దశలో 1,653 పాయింట్ల మేర లాభపడే అవకాశాలు కనిపించిన సెన్సెక్స్ చివరికి నష్టాల్లోనే ముగిసింది. అదే విధంగా సోమవారం నిఫ్టీ 757.80 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే. బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ ప్రారంభంలో ఎంతో ఆశాజనకంగా కనిపించిన ట్రేడింగ్ దాదాపు చివరి వరకూ అదే రీతిలో కొనసాగింది. కానీ, చివరి గంటలో లావాదేవీల రూపురేఖలు మారిపోయాయి. సెన్సెక్స్ మాదిరిగానే నిఫ్టీ కూడా నష్టంలోనే ముగిసింది.
బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 8.95 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇండస్‌ఇండ్ 8.89 శాతం, బజాజ్ ఫైనాన్స్ 6.26 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 4.74 శాతం, ఇన్ఫోసిస్ 4.68 శాతం చొప్పున నష్టపోయాయి. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న హెచ్‌యూఎల్ షేర్లు 3.49 శాతం లాభాలను ఆర్జించాయి. హీరో మోటార్స్ 3.09 శాతం, ఏషియన్ పెయింట్స్ 3.05 శాతం, పవర్‌గ్రిడ్ 2.53 శాతం, మారుతి సుజికీ 2.12 శాతం చొప్పున లాభాలను సంపాదించుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో జీ జీ ఎంటర్‌టైనె్మంట్ షేర్ల ధర అత్యధికంగా 20.05 శాతం పతనమైంది. ఇండస్‌ఇండ్ 9.20 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 8.92 శాతం, భారతి ఎయిర్‌టెల్ 7.57 శాతం, యూపీఎల్ 6.97 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, అటు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడం, ఇటు ఎస్బీఐ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు పెట్టుబడులకు సిద్ధం కావడం ఎస్ బ్యాంక్ షేర్లకు రెక్కలు తెచ్చాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయి, దివాలా దశకు చేరుకున్న ఈ బ్యాంక్ వాటాలు ఇటీవల కాలంలో భారీగా పతనమైన విషయం తెలిసిందే. అయితే, డిపాజిట్‌దారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వారి సొమ్ము భద్రంగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ ఇచ్చిన హామీ కొంత వరకు పని చేసింది. ఆ వెంటనే ఆమె ఎస్బీఐ ఉన్నతాధికారులతో సమావేశమై, ఎస్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనితో ఆ బ్యాంక్‌లో 4,750 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్బీఐ ముందుకొచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడికి సిద్ధమైంది. ఈ రెండు బ్యాంక్‌ల నిర్ణయాలు మదుపరుల ఆలోచనల్లో మార్పు తెచ్చింది. ఎస్ బ్యాంక్ షేర్లు కొనేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. ఈ బ్యాంక్ వాటాలు ఎన్‌ఎస్‌ఈలో ఏకంగా 59.30 శాతం లాభాల్లో ట్రేడయ్యాయంటే, డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. హెచ్‌యూఎల్ 3.09 శాతం, ఇచర్ మోటార్స్ 2.77 శాతం, హీరో మోటార్స్ 2.55 శాతం, కోల్ ఇండియా 2.33 శాతం చొప్పున లాభపడ్డాయి.
ఇలావుంటే, రూపాయి మారకం విలువ ఫోరెక్స్ మార్కెట్లో ఎలాంటి మార్పు లేకుండానే కొనసాగింది. డాలర్ విలువ 74.20 రూపాయలుగానే చలామణి అయింది. బ్రెంట్ ముడి చమురు బ్యారెర్‌కు 1.06 శాతం లేదా 29.73 డాలర్లు తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 7,000కు మించగా, సుమారు 1,75,000 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.