బిజినెస్

రైల్వే శాఖ కరోనా బాదుడు.. ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దేశంలోని 250 రైల్వే స్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను అమాంతం పెంచారు. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా మరింత వ్యాప్తి చెందేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్న నేపథ్యంలో పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను ఇపుడున్న 10 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచినట్టు సంబంధిత అధికార వర్గాలు మంగళవారంనాడు వెల్లడించాయి. పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోని ఆరు డివిజన్లు ముంబయి, వడోదర, అహమ్మదాబాద్, రత్‌లమ్, రాజ్‌కోట్, భావనగర్ ప్రాంతాల్లోని 250 రైల్వే స్టేషన్లలో పెంచిన ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, దక్షిణ రైల్వే జోన్ పరిధిలో కేవలం చెన్నైలో మాత్రమే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచినట్టు ఆ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సెంట్రల్ జోన్ కిందకు వచ్చే ఐదు డివిజన్లు ముంబయి (సీఎస్‌టీ), భుసావల్, నాగ్‌పూర్, షోలాపూర్, పుణే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికే పలు డివిజన్లలోని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను పెంచినట్టు సంబంధిత సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవానికి పండగలు, ప్రయాణికుల రద్దీ బాగా ఉన్న రోజుల్లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను పెంచుతారు. పండగ సీజన్, ప్రయాణికుల రద్దీ తగ్గిన తర్వాత మళ్లీ యథాతథంగా ప్లాట్‌ఫామ్ టికెట్ రేట్లు ఉంటాయి. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రజలను భయకంపితులను చేస్తున్న నేపథ్యంలో 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను పెంచారు.