బిజినెస్

ఎగుమతుల్లో నాణ్యత ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: విదేశాలకు ఎగుమతులు చేసే ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత ముఖ్యమని ఎక్స్‌పోర్ట్స్ ఇనస్పెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్‌కె సక్సేనా పేర్కొన్నారు. ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో రెండోరోజు శనివారం జరిగిన టెక్నికల్ సెషన్స్‌లో భాగంగా రెగ్యులేటరీ రిక్వైర్‌మెంట్స్ ఆఫ్ సీ ఫుడ్ ట్రేడ్ అం శంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకే విదేశీ ఎగుమతులు జరగాలన్నారు. ముఖ్యంగా భారత్ నుంచి ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తుల్లో మోతాదుకు మించి ఔషధ వినియోగం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. రైతుల్లో అవగాహనలోపం వల్ల ఆహార ఉత్పత్తుల్లో విదేశీయులు కోరుకునే ప్రమాణాలు కొరవడుతున్నాయని అభిప్రాయపడ్డారు. సంప్రదాయ ఆక్వా సాగులో రైతులు యాంటీ బయోటిక్స్ వినియోగంలో అవగాహన పెంచుకోవాలన్నారు. ఆక్వా రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులతో ఇటువంటి సదస్సులు తరచు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చన్నారు. ఇతర దేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో షరతులకు లోబడే వ్యవహరించాలన్నారు. నాణ్యత విషయంలో వారి అంచనాలకు అనుగుణంగానే ఎగుమతులు ఉండాలన్నారు. కంట్రీ డైరెక్టర్ యుఎస్ ఎఫ్‌డిఎ మాథ్యూ టి థామస్ మాట్లాడుతూ భారత్‌లో ఆక్వా రంగం మంచి అభివృద్ధి సాధించిందన్నారు. అయితే ఆక్వా ఉత్పత్తులను పెంచే క్రమంలో విరివిగా యాంటీబయోటిక్స్ వాడకం వల్ల అనర్ధాలు వస్తున్నాయన్నారు. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని నియంత్రించుకుంటూ ఉత్పత్తిని పెంచుకోవలన్నారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని నియంత్రించే అంశంపై పలు సూచనలు చేశారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్) ఇఐసిఐ ఆర్‌ఎం మండలిక్, సీ ఫుడ్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఎజె తారక్ తదితరులు పాల్గొన్నారు. రెండోరోజు సీ ఫుడ్ షోను పశ్చిమ బెంగాల్ ఫిషరీస్ మంత్రి జ్యోతి ప్రియ మాలిక్, మహారాష్ట్ర మంత్రి, సహా పలువురు ప్రతినిధులు సందర్శించారు.