బిజినెస్

నష్టాల్లోనే మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 19: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 581.28 పాయింట్లు (2.01 శాతం) పతనమై 28,288.23 పాయింట్లకు పడిపోయింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 205.35 పాయింట్లు (2.42 శాతం) తగ్గడంతో, 8,263.45 పాయింట్ల వద్ద ముగిసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో సూచీల పతనం కొనసాగింది. దీని ప్రభావం భారత్‌పైనే కనిపించింది. బీఎస్‌ఈలో తీవ్రమైన అనిశ్చిత వాతావరణం నెలకొనడంతో సెనె్సక్స్ ఒకానొక దశలో 2,656.07 పాయింట్ల వరకూ తగ్గినప్పటికీ, చివరిలో దేశీయ మదుపరులు ఆదుకోవడంతో కొంత వరకూ కోలుకుంది. ఎన్‌ఎస్‌ఈలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఒక దశలో నిఫ్టీ 7,900 పాయింట్ల కంటే తక్కువగా నమోదవుతుందేమోన్న అనుమానాలు తలెత్తాయి. కానీ, చివరి గంట ట్రేడింగ్‌లో సానుకూల వాతావరణం నెలకొనడంతో నిఫ్టీ 8 వేల పాయింట్లకు ఎగువన ముగిసింది. సెనె్సక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్ షేర్ల ధర దారుణంగా పతనమైంది. ఆ కంపెనీ షేర్లు 10.24 శాతం నష్టా ల్లో ట్రేడయ్యాయి. నష్టాలను చవిచూసిన మిగతా కంపెనీల షేర్ల విషయానికి వస్తే, మారుతి సుజికీ 9.85 శాతం, యాక్సిస్ బ్యాంక్ 9.50 శాతం, మ హీంద్ర అండ్ మహీంద్ర 9.28 శాతం, టెక్ మహీం ద్ర 8.43 శాతం, ఓఎన్‌జీసీ 7.35 శాతం చొప్పున పతనాన్ని ఎదుర్కొన్నాయి. అయితే, ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాలాను ఐటీసీ 7.50 శాతం, భార తి ఎయిర్‌టెల్ 4.39 శాతం, కోటక్ బ్యాంక్ 2.96 శాతం, హీరో మోటోకార్ప్ 2.39 శాతం, పవర్‌గ్రిడ్ 2.26 శాతం చొప్పున మెరుగుపడ్డాయి. మొత్తం మీద ఈ కంపెనీల షేర్లు సగటున 7.50 శాతం లా భాలను సంపాదించాయి. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈ లో భారతీ ఇన్‌ఫ్రా షేర్ల ధర ఏకంగా 18.28 శాతం పడిపోయింది. జీ ఎంటర్‌టైనె్మంట్ 13.80 శాతం, శ్రీ ఎంటర్‌టైనె్మంట్ 12.41 శాతం, ఓఎన్‌జీసీ 10.64 శాతం, బీపీసీఎల్ 10.60 శాతం చొప్పున నష్టపోయాయి. మరోవైపు ఐటీసీ 6.77 శాతం, భారతి ఎయిర్‌టెల్ 4.46 శాతం, ఇన్ఫోసిస్ 3.28 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.16 శాతం, పవర్‌గ్రిడ్ 2.29 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి. కా గా, అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల ధోరణుల మధ్య కొనసాగడం, విపరీతమైన అనిశ్చితి నెలకొనడం వంటి అంశాలు భారత్ సహా ప్రపంచ మా ర్కెట్లను అతలాకుతలం చేస్తున్నట్టు మార్కెట్ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితి మరికొంత కాలం ఇదే విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మెటల్, కేపిటల్ గూడ్స్, ఆటో, ఎనర్జీ, ఇండస్ట్రియల్స్ తదితర రంగాలకు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నది. టెలికాం రంగం అనూహ్యంగా మెరుగైన ఫలితాలను సాధిస్తూ, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఆసియాలో మదుపరుల సెంటిమెంట్లు కొనుగోళ్లకు అనుకూలంగా మార్చడంలో వివిధ దేశాలు, అధికారులు విఫలం కావడం మార్కెట్ల పతనానికి మరో కార ణం. ఆర్థిక మాంద్యం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ, ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకూ పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం లేదు. ఆసియా మార్కెట్ల తీరుతెన్నులను పరిశీలిస్తే, దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ అత్యంత దారుణంగా దెబ్బతిన్నది.
రూపాయి మారకపు విలువ మరింత తగ్గింది. దీనితో డాలర్ విలువ 81 రూపాయలకు చేరింది. సంస్థాగత పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసిన అంశాల్లో ఇది కూడా ఒకటి. ముడి చమురు ధర బ్యారెల్‌కు 5.55 శాతం (26.26 డాలర్లు) పెరిగింది. కోవిడ్-19తో ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 8,000 మందికిపైగా మృతి చెందగా, సుమారు రెండు లక్షల మంది చికిత్స పొందుతున్నారు.