బిజినెస్

ఉద్యోగ భద్రతపై జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పలు వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పార్క్‌లు మూతపడడంతో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఉపాధి కోల్పోతున్నారు. దీనిపై సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (సీఏపీఎస్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. షోరూమ్‌ల దగ్గర నుంచి హోటళ్ల వరకు అన్ని రకాల వ్యాపార కేంద్రాలను మూసివేయడంతో ఆయా సంస్థల యాజమాన్యాలు సెక్యూరిటీ గార్డులను తొలగిస్తున్నాయి. వీరంతా కాంట్రాక్టు ఉద్యోగులే కావడంతో యాజమాన్యాలపై ఎలాంటి డిమాండ్లు చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని సీఏపీఎస్‌ఐ ప్రస్తావిస్తూ కొంతమందికి మాత్రమే జీతాలు ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలో మిగతా వారి పరిస్థితి ఏమిటని సీఏపీఎస్‌ఐ చైర్మన్ విక్రమ్ సింగ్ తన లేఖలో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సుమారు 23వేల సెక్యూరిటీ ఏజన్సీలు ఉన్నాయని, 85 లక్షల మంది సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని ఆయన వివరించారు. కాంట్రాక్టు కుదుర్చుకున్న యాజమాన్యాలు హఠాత్తుగా వారిని తొలగించడం అన్యాయమని విక్రమ్ సింగ్ వ్యాఖ్యానించారు.
వెంటనే జోక్యం చేసుకుని ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు న్యాయం చేయాల్సిందిగా ప్రధానిని ఆయన కోరారు. అదేవిధంగా వారికి పీఎఫ్, పింఛన్, మెడికల్ వంటి సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.