బిజినెస్

పెట్రోలు సరఫరా ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంతో సామాజిక దూరాన్ని అవలంబిస్తున్నందున తలెత్తనున్న సమస్యల నుంచి బయటకు వచ్చేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని ఐఓసీ హామీ ఇచ్చింది. ఎయిర్‌లైన్స్‌కు కూడా ఇంధనం ఇదివరకటి మాదిరిగానే అందుతుందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ స్పష్టం చేశారు. సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని విడతల వారీగా అమలు చేస్తున్నామని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు ఎలాంటి ఇబ్బంది జరుగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు సరఫరా చేస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సూచించిన అన్ని విధానాలనూ అవలంబిస్తూనే, పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోకుండా చూస్తున్నామని అన్నా రు. ఆపరేటివ్ విభాగంలో రోజు విడిచి రోజు వర్క్ ఫ్రమ్ హోం ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్లాంట్లలోనూ ఉత్పత్తుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.