బిజినెస్

ఆక్వా రైతులకు డిజిటల్ డేటాబేస్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: రాష్ట్రంలోని ఆక్వా రైతులకు మేలు చేకూర్చేలా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల వివరాలు ఎప్పటి కప్పుడు తెలిజేసే సరికొత్త సాఫ్ట్‌వేర్ రూపొందించారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వా కల్చర్ సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందని మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) చైర్మన్ జయతిలక్ తెలిపారు. ఎంపెడా వద్ద రిజిస్టరైన సొసైటీలు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శలో భాగంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు సాఫ్ట్‌వేర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా జయతిలక్ మాట్లాడుతూ సముద్ర ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా రైతులకు మేలు చేకూరుతుందన్నారు.
భారతదేశంలో ఉన్న ఆక్వా రైతులకు సమీకృతం చేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎపిలో ప్రస్తుతం 300 ఆక్వా సొసైటీలు ఉన్నాయని, ఒక్కో సొసైటీలో 20 నుంచి 70 మంది రైతులు సభ్యులుగా ఉంటారన్నారు. ఎంపెడా వద్ద రిజిస్టరైన సంస్థలకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుందన్నారు. చిన్న తరహా ఆక్వా రైతులను సంఘటిత పరిచి, వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ఉపకరిస్తుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ భారతదేశపు ఆక్వా రంగానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని, ప్రపంచ ఆక్వా రంగానికి కూడా ఎపి కేంద్రంగా మారేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. దీనికి ఎంపెడా అందిస్తున్న చేయూతను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఫిషరీస్ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.

చిత్రం.. డిజిటల్ డేటాబేస్ సేవలను అందించే ఒప్పంద పత్రాలను ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు అందజేస్తున్న ఎంపెడా చైర్మన్ జయతిలక్