బిజినెస్

దూసుకెళ్తున్న కెటిపిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, సెప్టెంబర్ 25: ఖమ్మం జిల్లా పాల్వంచలో రూ 5,290 కోట్ల వ్యయంతో నెలకొల్పుతున్న కెటిపిఎస్ 7వ దశ కర్మాగారం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం చేస్తున్న ఈ కర్మాగారం పనులను 1-1-2015న ప్రారంభించారు. 2017 డిసెంబర్ లోపు కర్మాగారం పనులు పూర్తయ్యే విధంగా కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు శ్రమిస్తున్నారు. తుఫాన్ కారణంగా కొంతమేర పనులకు ఆటంకం కలిగినప్పటికీ అధికారులు చొరవ తీసుకుని పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ఏప్రిల్ నెలలో కర్మాగారంలోని చినీ పనులను ప్రారంభించారు. 275 అడుగుల ఎత్తుకు చినీ పనులు చేయాల్సి ఉండగా ముంబాయికి చెందిన బైగింగ్ ఇండియా కంపెనీ వారు ఈ చినీ పనులను ఆదివారం నాటికి 151 మీటర్ల ఎత్తువరకు పూర్తి చేశారు. విద్యుదుత్పత్తి చేసే క్రమంలో కర్మాగారం నుంచి వెలువడే పొగ సమీప ప్రదేశాలపై ప్రభావం చూపకుండా నేరుగా వాతావరణంలోకి (275 అడుగుల ఎత్తులో) వదిలేందుకు చినీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కర్మాగారంలోని బాయిలర్, సివిల్ పనులు పూర్తి కాగా ఎరక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈఎస్‌పి, పవర్ హౌస్, పంపుహౌస్, స్విచ్‌యార్డు, కోల్ హ్యాండ్లింగ్, కూలింగ్ టవర్, రోడ్లు, డ్రెయిన్‌ల పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కర్మాగారానికి బొగ్గు రవాణా కోసం రైల్వే పనులను వచ్చే జనవరిలో ప్రారంభించనున్నట్లుగా తెలిసింది. టర్బైన్ జనరేటర్ భవనంపై స్లాబు వేసేందుకు సిద్ధంగా ఉంది. వర్షం కారణంగా కొంతమేర పనులు నెమ్మదించినప్పటికీ 2017మార్చి నెలలో యూనిట్‌ను లైటప్ చేసి నిర్దేశించిన సమయానికి 2017 డిసెంబర్ కల్లా విద్యుదుత్పత్తిని ప్రారంభించాలనే ఉద్దేశంతో బిహెచ్‌ఈఎల్ కంపెనీ ప్రతినిధులు, ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగులు, అధికారులు కృషిచేస్తున్నారు. ఈ కర్మాగారం నిర్మాణం పూర్తయితే స్థానికులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.

చిత్రం.. కెటిపిఎస్ 7వ దశ కర్మాగారం నిర్మాణమవుతున్న దృశ్యం