బిజినెస్

ఇంటర్ కనెక్టివిటీపై ముదిరిన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర సెల్యులార్ ఆపరేటర్లకు, కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న రిలయన్స్ జియోకి మధ్య వివాదం ముదరడంతో టెలికామ్ నియంత్రణా సంస్థ ట్రాయ్ రంగంలోకి దిగింది. నిబంధనలకు విరుద్ధంగా కాల్‌డ్రాప్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో సంబంధిత టెలికామ్ ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ట్రాయ్ సోమవారం హెచ్చరించింది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకునేందుకు అవసరమైన దానికంటే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇంటర్ కనెక్షన్ పాయింట్లను (పిఓఐలను) అందజేస్తూ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర సంస్థలు తమ వినియోగదారులను వేధిస్తున్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఆరోపించడంతో ఇందుకు సంబంధించిన గణాంకాలను సమీక్షించామని, కాల్ డ్రాప్స్‌కు కారణమైన ఆపరేటర్లకు త్వరలోనే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్.శర్మ స్పష్టం చేశారు. ‘ఇప్పటికే మాకు గణాంకాలు అందాయి. సేవల నాణ్యతకు సంబంధించిన నిబంధనల కింద అనుమతించిన పరిమితి కంటే ప్రస్తుతం కాల్ డ్రాప్స్ సంఖ్య ఎన్నో రెట్లు అధికంగా ఉన్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని సెల్యులార్ ఆపరేటర్లు ఇంటర్ కనెక్టివిటీతో పాటు క్యుఓఎస్‌కు సంబంధించిన నిబంధనలను పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రాథమికంగా తేటతెల్లమవుతోంది’ అని శర్మ సోమవారం న్యూఢిల్లీలో పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. గత కొన్ని వారాలుగా తాము 75 నుంచి 80 శాతం వరకు కాల్ డ్రాప్స్ సమస్యను ఎదుర్కొంటున్నామని, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థల నిర్వాకం వలన కేవలం 10 రోజుల వ్యవధిలోనే 52 కోట్ల కాల్స్ ఫెయిల్ అయ్యాయని రిలయన్స్ జియో పేర్కొంది. ఈ ఆరోపణలను పరిశీలించేందుకు ఈ నెల 15 నుంచి 19వ తేదీ మధ్య నెట్‌వర్క్‌లో ఏర్పడిన రద్దీకి సంబంధించిన వివరాలను అందజేయాలని టెలికామ్ ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. అంతేకాకుండా సంబంధిత ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులను జారీ చేయడంతో పాటు ఇంటర్ కనెక్టివిటీకి సంబంధించిన లైసెన్సు నిబంధనలను సజావుగా పాటించేలా ఆదేశాలు కూడా జారీ చేయాలని నిర్ణయించినట్లు శర్మ తెలిపారు. అయితే నిబంధనలను పాటించకుండా భారీ సంఖ్యలో కాల్ డ్రాప్స్‌కు కారణమవుతున్న టెలికామ్ సంస్థలు ఏవో ఆయన వెల్లడించలేదు.