బిజినెస్

యుబిహెచ్‌ఎల్ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: రుణాల ఎగవేత వ్యవహారంలో న్యాయస్థానాల ముందుకు రాకుండా లండన్‌లో ఉంటున్న ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ హోల్టింగ్స్ లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్)కు ముఖ్య అధికారి (ప్రిన్సిపల్ ఆఫీసర్)గా నియమితులయ్యారు. ప్రస్తుతం యుబిహెచ్‌ఎల్‌కు మేనేజింగ్ డైరెక్టర్ లేకపోవడంతో మాల్యా బ్రిటన్ నుంచే యుబిహెచ్‌ఎల్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్టు ఆ సంస్థ స్టాక్ ఎక్స్‌చేంజికి వివరించింది. భారత్‌లో పలు బ్యాంకులకు 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి గత ఏడాది మార్చిలో బ్రిటన్‌కు పారిపోయిన యుబిహెచ్‌ఎల్ చైర్మన్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థల అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.