బిజినెస్

విశాఖ ఉక్కుకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 29: ఉక్కు ఉత్పత్తుల ధరలు చారిత్రాత్మకంగా తగ్గిపోవడంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 14 వందల 21 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఉక్కు సిఎండి పి.మధుసూదనరావు పేర్కొన్నారు. ఉక్కు తయారీ దిగ్గజం విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ 34వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) గురువారం ఉక్కు నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎండి మధుసూదనరావు మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చుకుంటే ఐదు శాతం వృద్ధితో విశాఖ ఉక్కు 12వేల 271 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించిందని, ఉక్కు ఉత్పత్తుల ధరల పతనం నేపథ్యంలో మెరుగైన ఉత్పాదకత, ఇందనం పొదుపు విస్తరణ యూనిట్‌ల్లో ఉత్పత్తి స్థిరీకరణపై దృష్టి సారించామన్నారు.