బిజినెస్

ఇటిఎఫ్‌లలోకి రూ.13 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) పెట్టుబడులపై కార్మిక సంఘాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను కేంద్ర కార్మిక శాఖ తోసిపుచ్చింది. ఇంతకుముందు 5 శాతంగా ఉన్న ఈ పెట్టుబడుల పరిమితిని రెట్టింపు చేసి 10 శాతానికి పెంచింది. దీంతో ప్రస్తుత (2016-17) ఆర్థిక సంవత్సరంలో ఇపిఎఫ్‌ఓ నుంచి స్టాక్ మార్కెట్లకు 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వెళ్లనున్నాయి. ఇటిఎఫ్‌లలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ పెట్టుబడుల పరిమితిని 10 శాతానికి పెంచుతూ ఇప్పటికే నోటిఫికేషన్‌ను జారీ చేశామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో ఇప్పటికే ఇటిఎఫ్‌లలో 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఇపిఎఫ్ మిగిలిన ఆరు నెలల్లో మరో రూ.11,500 కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఆయన తెలిపారు. ఇటిఎఫ్‌లలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ పెట్టుబడుల పరిమితిని పెంచేందుకు ఇపిఎఫ్‌ఓ ట్రస్టు సభ్యుల నుంచి ఆమోదాన్ని పొందారా? అని విలేఖర్లు ప్రశ్నించగా, ఈ విషయం గురించి ఇపిఎఫ్ సెంట్రల్ ట్రస్టు బోర్డు సభ్యుల (సిబిటి) సమావేశంలో ఇప్పటికే రెండుసార్లు చర్చించడం జరిగిందని, వీరిలో కొంత మంది సభ్యులు ఇటిఎఫ్‌లలో పెట్టుబడులను వ్యతిరేకిస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేశారని దత్తాత్రేయ చెప్పారు. పెట్టుబడుల పరిమితిని పెంచేందుకు సిబిటి ఆమోదం అవసరం లేదా? అని ప్రశ్నించగా, ఇపిఎఫ్ ట్రస్టు బోర్డు కంటే ప్రభుత్వం ఎంతో ఉన్నతమైనదని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ చెప్పారు.