బిజినెస్

నవంబర్ నుండి ఎపిలో సెల్‌కాన్ ఉత్పత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 1: సెల్‌కాన్ సంస్థ కార్యకలాపాలను ఆంధ్ర రాష్ట్రంలో నవంబర్ నెల నుండి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ వేంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ ఎండి గురుమూర్తి నాయుడు తెలిపారు. శనివారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల శాఖ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో 80 శాతం ఉద్యోగాలు చిత్తూరు జిల్లా వారికి ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. 80 శాతంలో 20 శాతం పురుషులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నిరుడు ప్రధాన మంత్రి చేతుల మీదుగా తమ సంస్థకి భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. నవంబర్ మూడవ వారం నుంచి సెల్‌కాన్ పరిధిలో ఐదు లక్షల మంది యువతకు శిక్షణ నిర్వహించి వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రత్యక్షంగా 50 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. కాగా, సెవెన్ హిల్స్ అనే కంపెనీ ఏర్పాటు చేసి వాటి ద్వారా సెల్‌కు సంబంధించిన విడి భాగాలైన చార్జింగ్ బ్యాటరీలు, సిప్‌సెట్ల తయారీ యూనిట్ ఇక్కడ నుంచే తయారు చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. తైవాన్, జపాన్, చైనా దేశాల నుండి నిపుణులైన వారిని రప్పించి యువతకు శిక్షణ ఇస్తామన్నారు. భారత్‌లో నోకియా సంస్థ తరువాత తమ సెల్‌కు డిమాండ్ ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జోనల్ మేనేజర్ ప్రతాప్, ఇడి మురళీకృష్ణ, సెల్ డవలప్‌మెంట్ అధికారులు ఎం శ్యామ్‌మోహన్, లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సెల్‌కాన్ సంస్థ ప్రతినిధి