బిజినెస్

స్వల్పంగా తగ్గిన వంట గ్యాస్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: నాన్-సబ్సిడీ వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ పరిణామాల మధ్య 14.2 కిలోల సిలిండర్ ధరను 4 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం తెలిపాయి. మరోవైపు జెట్ ఇంధనం ధర 8.7 శాతం పెంచుతున్నట్లు చమురు సంస్థలు స్పష్టం చేశాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటర్ విమాన ఇంధనం ధర 3,371.55 రూపాయలు ఎగిసి 42,157.01 రూపాయలను తాకింది. అయితే ఈ క్రమంలో విమాన చార్జీలు పెరుగుతాయా? అన్నదానిపై మాత్రం స్పందించేందుకు విమానయాన సంస్థలు అందుబాటులో లేవు.

యుబిహెచ్‌ఎల్ డైరెక్టర్ పదవికి సిద్ధార్థ గుడ్‌బై
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: యునైటెడ్ బ్రూవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్) డైరెక్టర్‌గా విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా తప్పుకున్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి బ్యాంకులు తమ 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలను వసూలు చేసుకునే క్రమంలో వివిధ సంస్థల పదవుల నుంచి ఇప్పటికే మాల్యా దిగిపోయినది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కుమారుడు కూడా అదే బాటలో నడుస్తున్నారు. కాగా, సిద్ధార్థ మాల్యా నిర్ణయం మార్చి 31 నుంచే అమల్లోకి వస్తుందని మాల్యా నేతృత్వంలోని యుబిహెచ్‌ఎల్ శుక్రవారం ప్రకటించింది.