బిజినెస్

అరుంధతీ భట్టాచార్య పదవీకాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాది పొడిగించింది. ఈ నెల 7 నుంచి పొడిగింపు వర్తించనుండగా, 2013 అక్టోబర్ 7న మూడేళ్లకుగాను ఎస్‌బిఐ చీఫ్‌గా భట్టాచార్య బాధ్యతలు స్వీకరించారు. కాగా, అనుబంధ బ్యాంకులను ఈ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం విలీనం చేసుకుంటున్న వేళ భట్టాచార్యనే మరో ఏడాదిపాటు సారథిగా నిర్ణయించింది కేంద్రం. భారతీయ మహిళా బ్యాంక్‌తోపాటు ఐదు అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లను ఎస్‌బిఐలో విలీనం చేస్తున్నది తెలిసిందే.
ఇందుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా, ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో పదవీకాలం పూర్తవుతున్న భట్టాచార్యను మరో ఏడాది కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎస్‌బిఐని ప్రపంచ స్థాయి బ్యాంక్‌గా మార్చడానికే అనుబంధ బ్యాంకులను అందులో విలీనం చేస్తుండగా, అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి. ఇక ఈ విలీనం తర్వాత 37 లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో, 22,500 శాఖలతో, 58,000 ఎటిఎమ్‌లతో ఎస్‌బిఐ వెలుగొందనుంది. ఎస్‌బిఐ కస్టమర్ల సంఖ్య కూడా 50 కోట్లపైకి వెళ్లనుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్న క్రమంలో ఈ విలీన ప్రక్రియ ఎస్‌బిఐకి వెన్నుదన్నుగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఎస్‌బిఐ నిరర్థక ఆస్తుల (మొండి బకాయిలు) విలువ లక్ష కోట్ల రూపాయలను దాటిపోయింది. కాగా, 2008లో ఎస్‌బిఐలో తొలిసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది. రెండేళ్ల తర్వాత 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ కూడా కలిసిపోయింది.