బిజినెస్

హార్వర్డ్ మేనేజ్‌మెంట్ చీఫ్‌గా భారతీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 1: హార్వర్డ్ మేనేజ్‌మెంట్ కంపెనీ (హెచ్‌ఎమ్‌సి) అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా భారత సంతతికి చెందిన ఎన్‌పి నర్వేకర్ నియమితులయ్యారు. ఈ మేరకు హెచ్‌ఎమ్‌సి ఓ ప్రకటనలో తెలియజేసింది. గడచిన పదేళ్లలో హెచ్‌ఎమ్‌సికి నలుగురు కొత్త సిఇఒలు రాగా, 54 ఏళ్ల నర్వేకర్ బాధ్యతలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎండోమెంట్, ఆర్థికపరమైన అంశాలను హెచ్‌ఎమ్‌సి పర్యవేక్షిస్తుంది. హార్వర్డ్ ఎండోమెంట్ విలువ 35.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు కొలంబియా విశ్వవిద్యాలయం ఇనె్వస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సిఇఒగా నర్వేకర్ పనిచేశారు.