బిజినెస్

కొనుగోళ్ల జోష్‌లో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మంగళవారం ద్రవ్యసమీక్ష నిర్వహించనున్న క్రమంలో కీలక వడ్డీరేట్లు తగ్గవచ్చన్న అంచనాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. సెప్టెంబర్ నెలలో దేశీయ ఆటో రంగ అమ్మకాలు బాగుండటం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పుంజుకోవడం వంటివి కలిసొచ్చాయి.
ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 377.33 పాయింట్లు పెరిగి 28,243.29 వద్ద ముగియగా, దాదాపు నెల రోజుల్లో సెనె్సక్స్ ఒక్కరోజే ఈ స్థాయి లాభాలను అందుకోవడం ఇదే. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 126.95 పాయింట్లు ఎగిసి 8,700 స్థాయిని అధిగమించి 8,738.10 వద్ద నిలిచింది. అయితే భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై పడకపోవడం గమనార్హం. గత వారం గురువారం ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించినది తెలిసిందే. దీంతో సెనె్సక్స్ 465 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాయి.
ఇదిలావుంటే సోమవారం రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇన్‌ఫ్రా, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు 3.01 శాతం నుంచి 1.59 శాతం వరకు లాభపడ్డాయి. ఆటో రంగ షేర్లయితే మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మారుతి సుజుకి షేర్ విలువ 3.70 శాతానికిపైగా పెరిగింది. హీరో, మహీంద్ర అండ్ మహీంద్ర, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ షేర్ల విలువలూ 3.18 శాతం నుంచి 1.11 శాతం మేర పుంజుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్ సూచీలు లాభపడగా, చైనా మార్కెట్లకు సెలవు. ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాభాల్లో కనిపించాయి.
లక్ష కోట్ల క్లబ్‌లోకి హిందుస్థాన్ జింక్
న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్ జింక్ సంస్థ మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. సోమవారం 1,07,640 కోట్ల రూపాయలుగా నమోదైంది.
ఈ సంస్థ షేర్ విలువ బిఎస్‌ఇలో ఈ ఒక్కరోజే 9.22 శాతం ఎగిసి 254.75 రూపాయల వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ 12.66 శాతం పెరిగి 262.80 రూపాయలను చేరింది. ఇక ఎన్‌ఎస్‌ఇలోనూ 9 శాతం ఎగిసి 254.45 రూపాయల వద్ద నిలిచింది. ఇదిలావుంటే మార్కెట్ విలువ ప్రకారం దేశీయ ఐటి రంగ దిగ్గజం టిసిఎస్ 4,75,227.81 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తర్వాతి స్థానాల్లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 3,53,628.14 కోట్లు), ప్రైవేట్‌రంగ బ్యాం కింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (రూ. 3,27,584.87 కోట్లు), ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి (రూ. 2,92,947.29 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ. 2,38,388.40 కోట్లు) ఉన్నాయి. కాగా, మొత్తంగా చూస్తే లక్ష కోట్ల రూపాయలకుపైగా మార్కెట్ విలువను కలిగి ఉన్న సంస్థలు కనీసం 25 ఉన్నాయి.