బిజినెస్

నవరాత్రి సందర్భంగా ‘వొడాఫోన్స్ తెలంగాణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: దేశంలో అగ్రశ్రేణి టెలికామ్ సర్వీసు ప్రొవైడర్ వోడాఫోన్ ఇండియా నవరాత్రి సందర్భంగా ఈ నెల 8వ తేదీన వోడాఫోన్స్ తెలంగాణ, తెలంగాణాస్ వోడాఫోన్ స్ఫూర్తితో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్ధ బిజినెస్ హెడ్ రోహిత్ టాండన్ తెలిపారు. 8వ తేదీ సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య హైదరాబాద్‌లో వోడాఫోన్ స్టోర్లను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన గేమ్స్‌లో పాల్గొనాలని కోరారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, మెహందీ పోటీలు, సంప్రదాయ వస్తధ్రారణలో బెస్ట్ డ్రస్ దంపతులు, ఇతర ఆసక్తికరమైన గేమ్స్‌లో వోడాఫోన్ కస్టమర్లు పాల్గొనవచ్చని ఆయన చెప్పారు.
తెలుగులో ఆరోగ్య సమాచార వేదిక
భారతదేశంలో మొట్టమొదటి బహుభాషా ఆరోగ్యసమాచార వేదిక మోడస్టా.కామ్ తెలుగులో ఇంటర్నెట్, యాప్ ద్వారా వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారనికి ప్రత్యేక వేదికను ప్రారంభించింది. ఇందులో వ్యాసాలు, వీడియోల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం, సలహాలు, సూచనలు తెలుగులో లభిస్తాయి. గర్భిణులు తమ ప్రసవ గడువు తేదీ వివరాలు తెలుసుకోవచ్చును. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు మోడస్టా హెల్త్ పేరుతో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆ సంస్ధ తెలిపింది.