బిజినెస్

8 శాతం వృద్ధి సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పారదర్శక ప్రఅకియలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం లాంటి కారణాల వల్ల దేశం రాబోయే ఒకటి, రెండు దశాబ్దాల్లో 8 శాతానికి పైగా వృద్ధి సాధించడానికి తోడ్పడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ దిశగా రాష్ట్రాలు కేంద్రంతో కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని ఆమె అన్నారు. ‘8 శాతం వృద్ధి సాధ్యమే. ప్రభుత్వం ఆ లక్ష్యంతోనే కృషి చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అధిక వృద్ధిని సాధించాలనే ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తోంది’ అని గురువారం ఇక్కడ సిఐఐ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారత ఆర్థిక సదస్సులో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అంశాలు, ఇబ్మందుల పట్ల అవగాహన రాజకీయంగా కూడా పని చేస్తోందని ఆమె అన్నారు. ‘ఈ అడ్డంకులను తొలగించడానికి, సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని ముందుకు సాగడానికి కృతనిశ్చయంతో ఉన్నప్పుడు, పారదర్శకమైన విధానాలు ఏర్పడేలా చూసినప్పుడు 8 శాతం వృద్ధి సాధ్యమనే అనిపిస్తుంది. అందువల్ల అది సాధ్యమే’ అని ఆమె చెప్పారు. వృద్ధి రేటు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వస్తుసేవల పన్ను(జిఎస్‌టి), ‘జామ్’(జన్‌ధన్, ఆధార్, మొబైల్), వ్యాపారాన్ని సులభతరం చేయడం అనే మూడు మూలస్తంభాలపైన ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి చెప్పారు. అవినీతిని తొలగించి, పారదర్శకతను తీసుకు రావడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అన్ని రాష్ట్రాలను ఒక్క తాటిపైకి తేవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని, రాష్ట్రాలు, కేంద్రం కలిసి పని చేస్తున్నాయని ఆమె చెప్పారు. రాబోయే నాలుగైదు నెలల్లో తమ దృష్టి రాష్ట్రాలతో కలిసి పని చేయడం, అడ్డంకులను తొలగించడం, వ్యాపారం మరింత సురక్షితంగా ఉంటుందనే భావన కల్పించడంపైనే తమ దృష్టి అంతా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

చిత్రం.. భారత ఆర్థిక సదస్సులో శ్రీలంక ప్రధాన మంత్రి రనిల్ విక్రమసింఘేతో ముచ్చటిస్తున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా
సీతారామన్