బిజినెస్

బయోఫార్మా, జెనెటిక్స్ రంగాల్లో దేశానికి ఉజ్వల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: భారతదేశానికి బయోఫార్మా, బయో జెనెటిక్స్ రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, 2030 సంవత్సరం నాటికి బయో ఉత్పత్తుల టర్నోవర్ రూ. 40 బిలియన్ డాలర్లకు చేరుతుందని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ డైరక్టెర్ జనరల్ ప్రొఫెసర్ డి.స్వామినాథన్ అన్నారు. బయోఫార్మాపై గురువారం ఇక్కడ అసోచామ్, కేంద్ర ఫార్మాసూటికల్స్ శాఖ సదస్సు నిర్వహించాయ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 300 మిలియన్ డాలర్ల టర్నోవర్ బయో పరిశ్రమలో ఉందన్నారు. జాతీయ స్ధాయిలో కొత్త నియంత్రణ విధానం అమలులోకి వచ్చిందన్నారు. దీని వల్ల 2030 నాటికి బయోఫార్మా విశేషంగా పుంజుకుంటుందన్నారు. బయోఫార్మా రంగం ఉత్పత్తులపై అసోచామ్ రూపొందించిన నివేదికను ఆవిష్కరించిన ఆయన ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. అసోచామ్ హెల్త్‌కేర్ ఫార్మా డివిజన్ హెడ్ సందీప్ కొశ్చార్ మాట్లాడుతూ, దేశంలో బయోఫార్మా రంగం ఇంకా శైశవ దశలో ఉందని, ఆధునిక పరిశోధనలను ఉత్పత్తులకు అన్వయించుకోవాలన్నారు. ప్రభుత్వం, ఉత్పత్తిదారులు, రెగ్యులేటర్లు, క్లినికల్ అసోసియేషన్లు, పేటెంట్ సపోర్టు గ్రూపులు, పరిశ్రమ వర్గాలు, సైంటిస్టులు ఒక వేదికపైకి రావాలన్నారు. బయో ఫార్మా, జెనెటిక్స్ రంగంలో నార్వే దేశం ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తోందన్నారు. సిసిఎంబి డైరక్టెర్ డాక్టర్ రాకేష్ కె మిశ్రా మాట్లాడుతూ బయో ఫార్మా రంగంలో రోగుల గళాన్ని కూడా వినాలన్నారు. రోగుల కోసం బయో ఫార్మా ఉత్పత్తులు నిర్దేశించారని, ఈ రంగంలో రోగులే అంతిమ నిర్ణేతలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. బయో ఫార్మా, బయో జెనెటిక్స్ రంగం నుంచి బయోసిమిలర్ రంగం అవతరించిందని, ఈ రంగానికి అద్భుతమైన భవిత ఉందన్నారు. ఏపిఇడిబి సీనియర్ సలహాదారు ఎం శ్రీనివాస శంకర ప్రసాద్ మాట్లాడుతూ, అమరావతిలో గోదావరి బయో టెక్‌పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పనున్నట్లు చెప్పారు. సద్గురు మేనేజిమెంట్ కనె్సల్టెంట్స్ డైరెక్టర్ డాక్టర్ పుష్పా విజయరాఘవన్ మాట్లాడుతూ, బయోసిమిలర్ రంగంకు ప్రస్తుతం దేశంలో మార్కెట్ 2.2 బిలియన్ డాలర్లు ఉందన్నారు. బయలాజిక్ డ్రగ్స్, క్లినికల్ పైప్‌లైన్ సదుపాయాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్ధాయిలో వివిధ రాష్ట్రాల నుంచి బయో సైంటిస్టులు హాజరయ్యారు.

చిత్రం.. సదస్సులో పాల్గొన్న బయోఫార్మా, బయోజెనెటిక్స్ రంగాల ప్రతినిధులు