బిజినెస్

భారత్‌లో సుస్థిరమైన వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఏప్రిల్ 1: భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం కనిపిస్తున్న వృద్ధి రాబోయే రెండు దశాబ్దాలకుపైగా కాలంలోనూ ఇలాగే ఉండగలదన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. నాలుగు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైట్లీ.. చివరి రోజైన శుక్రవారం ఇక్కడ జరిగిన ‘ఇనె్వస్ట్ ఇన్ ఇండియా’ రౌండ్ టేబుల్ సెషన్‌లో భాగంగా భారత, ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు, సిఇఒలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత జిడిపి వృద్ధిపథంలో ఉందని, మున్ముందు కూడా అది అలాగే ఉంటుందని, భారీగా పెట్టుబడులతో భారత్‌కు రావాలని పిలుపునిచ్చారు. కనీసం మరో 10-20 సంవత్సరాలపాటు భారత జిడిపి పరుగులు ఆగబోవన్నారు. ‘ప్రస్తుత భారత జిడిపి వృద్ధిరేటు 7.5 శాతం రాబోయే కాలంలో మరింతగా పెరుగుతుంది. వివిధ రంగాల అభివృద్ధిపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా గ్రామీణ భారతంపై దృష్టి పెట్టాం.’ అన్నారు. పేదరిక నిర్మూలన దిశగా వెళ్తున్నామన్న ఆయన లిబరలైజేషన్ ప్రక్రియ ప్రయోజనాలను దేశ ప్రజలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వార్ధక్య (్భవిష్య) నిధి రంగానికి చెందిన ప్రముఖ నాయకులను భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇక ఈ సమావేశంలో ఆస్ట్రేలియా చిన్నతరహా వ్యాపారాల మంత్రి, అసిస్టెంట్ ట్రెజరర్ కెల్లి ఓడ్వెయర్, ఫ్యూచర్ ఫండ్ చైర్మన్ పీటర్ కాస్టెల్లో, భారత హై కమిషనర్ నవదీప్ సూరి కూడా పాల్గొన్నారు. అలాగే భారత పారిశ్రామిక సంఘం ఫిక్కీ నేతృత్వంలోని భారత బృందం కూడా సమావేశానికి హాజరైంది. ఫ్యూచర్ ఫండ్ చైర్మన్ పీటర్ కాస్టెల్లోను కలుసుకుని వార్ధక్య నిధి పెట్టుబడులపై జైట్లీ చర్చించారు. వార్ధక్య నిధి అనేది స్వచ్చంధ పన్ను ప్రయోజన పెన్షన్ పథకం. ఇది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) నడిపిస్తున్న తప్పనిసరి వృత్తి సంబంధిత పథకాలకు ఆడిషన్‌లో ఓ సప్లిమెంటరీ సామాజిక భద్రతగా కూడా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఈ వార్ధక్య నిధి సొమ్మును భారత్‌లో పెట్టుబడులుగా మార్చాలని జైట్లీ సమావేశంలో కోరారు. భారత్‌లో పన్నుల విధానాన్ని హేతుబద్ధీకరిస్తున్నామని, ఉత్పాదక, వౌలిక రంగాల్లో కూడా పెట్టుబడులకు విశేష అవకాశాలున్నాయన్నారు. ఇకపోతే సమావేశంలో ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా మాట్లాడుతూ గత ఏడాది భారత్ ప్రగతి పరిగణనలోకి తీసుకునేలా ఉందని, జిడిపి వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు తదితర స్థూల ఆర్థిక సూచీలు మెరుగుపడ్డాయన్నారు. విదేశీ పెట్టుబడుల రాక కూడా పెరిగిందని తెలియజేశారు. పెట్టుబడులకు వార్ధక్య నిధులు అనుకూలంగా ఉంటాయన్న ఆయన ఇక్కడి ప్రాజెక్టులకు భారత పరిశ్రమ పెట్టుబడులు పెడుతోందని గుర్తుచేశారు. భారత హై కమిషనర్ నవదీప్ సూరి మాట్లాడుతూ భారత్‌లో దాదాపు భవిష్య నిధికి చెందిన 1 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల పెట్టుబడులున్నాయని, మున్ముందు ఇవి మరింత పెరిగే వీలుందన్నారు. పన్నులకు సంబంధించి కొంత ఆందోళన జైట్లీ ముందు ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు వ్యక్తం చేశారన్న ఆయన పన్నుల విధానాన్ని సరళతరం చేస్తున్నామని జైట్లీ బదులిచ్చినట్లు చెప్పారు. స్థిరమైన పన్నుల విధానానికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

చిత్రం ఫిక్కీ, ఆస్ట్రేలియా వ్యాపార మండలి మధ్య ఎమ్‌ఒయు దృశ్యం