బిజినెస్

గృహరుణాలపై వడ్డీ రేటు తగ్గించిన డిహెచ్‌ఎఫ్‌ఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలోని ప్రముఖ రుణ వితరణ సంస్థల్లో ఒకటైన డిహెచ్‌ఎఫ్‌ఎల్ (దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) గృహ రుణాలపై వడ్డీ రేటును 0.2 శాతం తగ్గించింది. ప్రస్తుత పండుగల సీజన్‌లో కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు డిహెచ్‌ఎఫ్‌ఎల్ ఈ చర్య చేపట్టింది. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే కొత్త ఖాతాదారులకు 9.35 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందజేస్తామని, తగ్గించిన వడ్డీ రేటు ఈ నెల 11వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఆ సంస్థ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోదల్చుకున్న అల్ప, మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి తగ్గించిన వడ్డీ రేటుతో 30 లక్షల రూపాయల వరకు రుణాలను అందజేయనున్నట్లు డిహెచ్‌ఎఫ్‌ఎల్ స్పష్టం చేసింది.