బిజినెస్

పేటెంట్ ఉల్లంఘన కేసులో సామ్‌సంగ్‌పై యాపిల్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 8: పేటెంట్ ఉల్లంఘన కేసులో సామ్‌సంగ్‌పై యాపిల్ గెలిచింది. 120 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని యాపిల్‌కు చెల్లించాలని సామ్‌సంగ్‌ను కోర్టు ఆదేశించింది. స్లైడ్ టు అన్ లాక్, ఆటోకరెక్ట్ ఫీచర్లకు సంబంధించి ప్రపంచ స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజాలైన సామ్‌సంగ్, యాపిల్ మధ్య వివాదం తలెత్తింది. తమ అనుమతి లేకుండానే సామ్‌సంగ్ తమ టెక్నాలజీని చౌర్యం చేసిందని యాపిల్ అమెరికాలోని క్యాలిఫోర్నియాలోగల శాన్‌జోస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సామ్‌సంగ్ వివరణ సహేతుకంగా లేకపోవడంతో యాపిల్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలోనే 119.6 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలని తెలిపింది. కాగా, డిజిటల్ ఫోటో టెక్నాలజీకి సంబంధించి సామ్‌సంగ్ పేటెంట్‌ను యాపిల్ దొంగిలించినట్లు కూడా బయటపడగా, చాలా ఏళ్ల నుంచి మొబైల్ డివైజ్ టెక్నాలజీ పేటెంట్లపై ఇరు సంస్థల మధ్య యుద్ధం నడుస్తోంది. మరోవైపు తాజా తీర్పుపై స్పందించేందుకు ఇరు సంస్థల ప్రతినిధులు అందుబాటులో లేరు.