బిజినెస్

ఇ-కామర్స్‌లో సహకారం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ప్రపంచ వాణిజ్యంలో వర్థమాన దేశాల భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు పనే్నతర అవరోధాలను తొలగించుకోవడంతో పాటు ఇ-కామర్స్ రంగంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని గురువారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వాణిజ్య మంత్రులు ఉద్ఘాటించారు. అలాగే మేథో సంపత్తి హక్కుల (ఐపిఆర్) రంగంలో బ్రిక్స్ సభ్య దేశాలు పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని వీరు వక్కాణించారు. ఇందుకోసం ఈ ఐదు దేశాలు మేథో సంపత్తి హక్కుల సహకార వ్యవస్థ (బ్రిక్స్ ఐపిఆర్‌సిఎం)ను ఏర్పాటు చేసుకున్నాయి. నిర్ణయించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పని ప్రారంభించి సమన్వయంతో సభ్య దేశాల మధ్య క్రమానుగతంగా సహకారాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలను పెంపొందించాలని బ్రిక్స్ వాణిజ్య మంత్రులు ఐపిఆర్‌సిఎంకు నిర్దేశించారు.
10 ద్వైపాక్షిక భేటీలు నిర్వహించనున్న మోదీ
ఇదిలావుంటే, గోవాలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం, బిఐఎంఎస్‌టిఇసి సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ సహా వివిధ దేశాలకు చెందిన దాదాపు పది మంది నేతలతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించనున్నారు. రష్యా ప్రధానితో శనివారం వార్షిక శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత అదే రోజు మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. అలాగే సోమవారం బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమర్‌తో మోదీ సమావేశం కానున్నారు. బ్రిక్స్, బిఐఎంఎస్‌టిఇసి సమావేశాల్లో ప్రధానంగా ఉగ్రవాద సమస్యతో పాటు ఆర్థిక వ్యవహారాలు, అనుసంధానతకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని, ద్వైపాక్షిక సమావేశాల్లో భారత్ రక్షణ, భద్రత, ఇంధన, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తుందని అధికారులు గురువారం వెల్లడించారు. బ్రిక్స్ దేశాల అధినేతలతో పాటు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ ప్రధాన మంత్రులతో చర్చలు జరుపనున్న మోదీ మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్‌సాన్ సూకీతో కూడా ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. మయన్మార్‌లో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంగ్‌సాన్ సూకీ ఈ నెల 16వ తేదీన తొలిసారి భారత్‌కు రానున్నారు.