బిజినెస్

తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: రిటైల్ ద్రవ్యోలబణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్టస్థాయి అయిన 4.31 శాతానికి పడిపోయింది. ప్రధానంగా సామాన్యుడినుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరికీ నిత్యావసర వస్తువుల్లో ఒకటైన కూరగాయల ధరలు గణనీయంగా తగ్గడం రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణం. ఫలితంగా ఆగస్టు నెలలో 5.05 శాతంగా ఉండిన ద్రవ్యోల్బణం 0.74 శాతం తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.41 శాతంగా ఉండింది. గత ఏడాది ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం అతి తక్కువగా 3.74 శాతం నమోదైంది. గురువారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం 7.2 శాతం తగ్గి నెగెటివ్ జోన్‌లో ఉంది. ఆగస్టు నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 1.02 శాతంగా ఉండింది. అలాగే గత కొన్ని నెలలుగా మండిపోతున్న పప్పు్ధన్యాల ధరలు సైతం గత నెలలో కాస్త చల్లబడ్డాయి. గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చైపలు లాంటి వాటి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. అయితే పండ్ల ధరలు మాత్రం అంతకుముందు నెలతో పోలిస్తే ప్రియమైనాయి. మొత్తం మీద ఆహార ఆధారిత ద్రవ్యోల్బణం సైతం తగ్గింది. ఆగస్టు నెలలో 5.91 శాతం ఉండిన ఈ ద్రవ్యోల్బణం 3.88 శాతానికి తగ్గింది.