బిజినెస్

‘సహకార’ పునర్వ్యవస్థీకరణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 2: ఆంధ్ర రాష్ట్రంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్) మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. సహకార శాఖ ద్వారా వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంతో పాటు మార్కెటింగ్ రంగంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడం, రైతులకు ప్రయోజనకరమైన కార్యక్రమాలను నిర్వహించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ సమావేశ హాలులో శనివారం సహకార సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్‌కుమార్ మాట్లాడుతూ సహకార సంఘాలన్నీ బలోపేతం కావాలంటే సమష్టి కృషితో ముందుకు సాగాలన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సహకార సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇంతవరకు 5 జిల్లాల్లో నిర్వహించామన్నారు. సహకార సంఘాల సేవలను విస్తరించడం ద్వారా రైతులకు ఎంతోమేలు చేకూరుతుందన్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో త్వరలో ఎరువుల మిక్సింగ్ ప్లాంటును నిర్మించనున్నట్టు విజయ్‌కుమార్ చెప్పారు. ఈ ప్లాంటు ఏర్పాటుతో రైతులకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో గిడ్డంగుల అభివృద్ధి, సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాల కల్పన, ఎరువుల పంపిణీ, నూతన వ్యాపారాల విస్తరణ వంటి కార్యక్రమాలు చేపట్టడానికి మార్క్‌ఫెడ్ కృషి చేస్తోందన్నారు. రైతులకు మెరుగైన పరిజ్ఞానాన్ని అందించే వేదికలుగా సహకార సంఘాలు నిలవాలని కోరారు. ఇటీవల విజయవాడలో జరిగిన మార్క్‌ఫెడ్ సర్వసభ్య సమావేశంలో సభ్యుల నుండి వచ్చిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సహకార సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ శివకోటి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు రుణాల మాఫీ అనేది ఒక విప్లవాత్మకమైన నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయం వలన రైతులు బలోపేతం అయ్యేందుకు అవకాశం కలిగిందన్నారు. సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు కెవి సత్యనారాయణరెడ్డి, ఎపి మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ కరుణ తదితరులు సమావేశంలో మాట్లాడారు.