బిజినెస్

పెట్రోల్ పంపుల ఏర్పాటుకు బిపికి ప్రభుత్వ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఐరోపాకు చెందిన మూడో అతిపెద్ద చమురు సంస్థ బ్రిటీష్ పెట్రోలియంకు దేశవ్యాప్తంగా 3,500 పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లైసెన్సును మంజూరు చేసింది. దీంతో భారత్‌లో పెట్రోల్ పంపుల నిర్వహణ సంస్థల సంఖ్య పదికి చేరింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పిసిఎల్)తోపాటు ప్రైవేట్‌రంగ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ ఆయిల్, నుమలిఘర్ రిఫైనరీస్ లిమిటెడ్, మంగళూర్ రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, హల్దియా పెట్రోకెమికల్స్ లిమిటెడ్, రాయల్ డచ్ షేల్ సంస్థలు దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకాలను నిర్వహిస్తున్నాయి. వీటిలో ఐఒసికి అత్యధికంగా 25,363 పెట్రోల్ పంపులున్నాయి. కోల్‌కతాకు చెందిన హల్దియా పెట్రోకెమికల్స్‌కు ఇటీవలే అనుమతి లభించింది.