బిజినెస్

ఎగిసిన అల్ట్రాటెక్ సిమెంట్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, అక్టోబర్ 17: అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 25 శాతం పెరిగి 613.64 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 490.59 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఏకీకృత ఆదాయం ఈసారి 6,508.62 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 6,669.45 కోట్ల రూపాయలుగా ఉంది. సంస్థాగత వ్యయం తగ్గడంతో ఆదాయం పడిపోయినా లాభాలు పెరిగాయని సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు అల్ట్రాటెక్ తెలియజేసింది. ఈసారి సంస్థ ఖర్చులు 5,624.16 కోట్ల రూపాయలుగా ఉన్నాయని, నిరుడు 5,972.39 కోట్ల రూపాయలుగా ఉన్నాయని చెప్పింది.
ఇక నికర అమ్మకాలు ఈసారి 5,709 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 5,857 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
హెచ్‌డిఎఫ్‌సి లైఫ్
హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్-సె ప్టెంబర్)లో 12 శాతం పెరిగి 464 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే వ్యవధిలో 415 కోట్ల రూపాయల లాభాన్ని పొందినట్లు ఓ ప్రకటనలో సోమవారం సంస్థ తెలిపింది. మొత్తం ప్రీమియం ఈసారి 7,649 కోట్ల రూపాయలుగా ఉంది.
డిహెచ్‌ఎఫ్‌ఎల్
మార్ట్‌గేజ్ సంస్థ దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డిహెచ్‌ఎఫ్‌ఎల్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో అంతకుముందుతో పోల్చితే 28.8 శాతం ఎగిసింది. ఈసారి 232.61 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో 180.36 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,167.72 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,811.63 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.
లక్ష్మీ విలాస్ బ్యాంక్
ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 44.63 శాతం పెరిగి 64.84 కోట్ల రూపాయలుగా నమోదైంది.
గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్ వ్యవధిలో 44.83 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం ఈసారి 830 కోట్ల రూపాయలుగా, పోయినసారి 690 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సోమవారం బ్యాంక్ ప్రకటించింది.
ఓరియంట్ పేపర్
ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 2.76 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో 26.24 కోట్ల రూపాయల నష్టాన్ని ఈ సంస్థ చవిచూసింది.
ఆదాయం ఈసారి 405.56 కోట్ల రూపాయలుగా, పోయినసారి 370.70 కోట్ల రూపాయలుగా ఉందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఓరియంట్ పేపర్ తెలిపింది.