బిజినెస్

జాతీయ మార్కెట్‌లోకి నన్నారి, మారేడు షర్బత్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 2: గిరిజన ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్న గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఈ ఏడాది సరికొత్త రీతిలో నన్నారి, మారేడు (బిల్వ) షర్బత్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ఇక నుంచి జాతీయ మార్కెట్‌లోకి తీసుకువెళ్ళాలని కూడా నిర్ణయించింది. దీనివల్ల సంస్థ ప్రతిష్ట పెంచడంతోపాటు ఆర్థికంగా మరింత బలపడవచ్చని భావిస్తోంది. ఈ వేసవి సీజన్‌లో వినియోగదారులను మరింతగా ఆకర్షించే విధంగా వేసవి తాపాన్ని తీర్చి, ఆహ్లాదాన్ని, ఔషధ గుణాలు కలిగిన మారేడు షర్బత్‌ను ఉమ్మడి రాష్ట్రాల్లో విరివిగా విక్రయించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అలాగే జాతీయ మార్కెట్‌లోకి దీన్ని తీసుకువెళ్ళి ఆశించిన స్థాయిలో ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే దేశంలోని పలు రాష్ట్రాల్లో నన్నారి, మారేడు షర్బత్‌లను మార్కెట్ చేయాలని భావిస్తోంది. మారేడు లేదా బిల్వ పండు గుజ్జు నుండి తయారు చేసిన నూరు శాతం సహజసిద్ధమైన, ప్రకృతిపరమైన ఔషధ గుణాలు కలిగి ఉండే వేసవి పానీయంగా తయారు చేసి మార్కెట్‌లో షర్బత్‌లను అమ్ముతున్నారు. మంచి సువాసన కలిగిన ఈ షర్బ త్‌లు రక్తనష్ట నివారణ, స్కర్వీ వ్యాధి నిర్మూలనకు చక్కటి చికిత్సగా భావించవచ్చు. అంతే గాక ఇవి ఉదరాభి బలం చేకూర్చి, అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయ. తద్వారా మలబద్ధకాన్నీ నివారిస్తాయ వీటితోపాటు జీర్ణకోశాన్ని మరింత పటిష్టం చేస్తాయ. జీర్ణకోశంలో ఏర్పడే అల్సర్లను మాయం చేయగలిగే శక్తి ఒక్క దీనికి మాత్రమే ఉందని సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నన్నారి షర్బత్‌ను చిత్తూరులో తయారు చేస్తుండగా, దీని వేళ్ళు ఈ ప్రాంతంలో విస్తారంగా లభిస్తున్నందున షర్బత్ తయారీ ఇక్కడే చేపట్టారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గిరిజన ప్రాంతాల్లో విస్తారంగా లభిస్తున్న కారణంగా మారేడు షర్బత్ తయారీ యూనిట్‌ను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారు. నన్నారి, మారేడు షర్బత్ సీసా ధర రూ. వందగా నిర్ణయించారు.