బిజినెస్

‘మేళతాళాల’తో జప్తు నోటీసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారినుంచి ఆ సొమ్ము వసూలు చేయడానికి బ్యాంకు అధికారులు వారి ఇళ్ల ముందు ప్రదర్శనలు జరపడం లేదా టముకు (తప్పెట) వేయడం లాంటి చర్యలకు పాల్పడ్డం గతంలో మనం చూశాం. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో మోసాలకు పాల్పడే వారు తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఇనె్వస్టర్లకు సొమ్ములు తిరిగి చెల్లించని వారి ఇళ్ల ముందు కూడా ఇలాంటి తప్పెట్లు, లౌడ్‌స్పీకర్లులాంటి వాటి ద్వారా సమన్లు జారీ చేయడం, వారి ఆస్తులను జప్తు చేయడంలాంటి వాటిని ప్రకటించాలని మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ అనుకుంటోంది. అంతేకాకుండా నిధులను రికవరీ చేయడం కోసం స్వాధీనం చేసుకున్న ఆస్తులను జప్తు చేసి అమ్మేయాలని కూడా సెబి అనుకుంటోంది. ఇనె్వస్టర్లనుంచి పెద్ద ఎత్తున మోసపూరితంగా పెట్టుబడులు స్వీకరించి తిరిగి చెల్లించని సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారాలను సెబికి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సంస్థలనుంచి ఆ నిధులను రికవరీ చేయడం కోసం నోటీసులు, సమన్లను వాటి గోడలు, తలుపులకు అంటించడానికి, ఆస్తుల జప్తులు, అమ్మకాల నోటీసులను ప్రకటించడం కోసం థర్డ్ పార్టీ ఏజన్సీల సేవలను తీసుకోవాలని సెబీ అనుకుంటోంది. రిజిస్టర్డ్ అసెట్ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, పేరుమోసిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు లేదా డిటెక్టివ్, ఇతర ప్రొఫెషనల్ ఏజన్సీలను ఇలాంటి సేవలకోసం సెబీ ఉపయోగించుకుంటుంది. ఒక వేళ నోటీసులు, సమన్లులాంటివి అంటించే సమయంలో చిరునామాదారులు గనుక అందుబాటులో ఉంటే వారికే వ్యక్తిగతంగా అందించడం జరుగుతుందని సెబీ తెలిపింది.