బిజినెస్

సామాన్యులకూ విమాన యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ప్రాంతీయ స్థాయిలో విమానయానానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉడాన్’ పథకం శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ పథకానికి నిధులు సమకూర్చేందుకు షెడ్యూల్డు మార్గాల్లో ప్రయాణాలపై సుంకాన్ని విధించడాన్ని ప్రభుత్వం సమర్ధించుకుంది. సామాన్య ప్రజలకు సైతం విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జులై 1వ తేదీన ఉడాన్ (ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్) ముసాయిదాను ఆవిష్కరించిన ప్రభుత్వం గంటసేపు విమానయానానికి అన్ని చార్జీలూ కలిపి 2,500 రూపాయల ధరను నిర్దేశించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు శుక్రవారం ప్రకటించనున్నారు. ఇప్పటివరకూ విమాన సర్వీసులు లేని ప్రాంతాలతో పాటు అరకొర సర్వీసులున్న ప్రాంతాలకు సేవలను అందించేందుకు, అలాగే ఇందుకు అవసరమయ్యే వనరులను ప్రాంతీయ అనుసంధాన నిధి ద్వారా సమకూర్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో అసలు విమానయాన సేవలే లేని విమానాశ్రయాలు 394, అరకొర సేవలున్న విమానాశ్రయాలు 16 ఉన్నాయి. అయితే ఉడాన్ పథకంతో ప్రాంతీయ స్థాయిలో విమానయానం ఊపందుకుంటుందని, ఈ పథకం పట్ల విమానయాన పరిశ్రమ నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా గురువారం న్యూఢిల్లీలో తెలిపారు.