బిజినెస్

ముకేష్ అంబానీ సంపద ఎస్తోనియా జిడిపితో సమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: నికర సంపద 22.7 బిలియన్ డాలర్లకు పెరగడంతో వరుసగా తొమ్మిదో ఏడాది మన దేశంలో అత్యంత సపన్నుడిగా నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేష్ అంబానీ ఆస్తి ఎస్తోనియా స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)తో సమానంగా ఉందని ‘్ఫర్బ్స్ ఇండియా’ పత్రిక వెల్లడించింది. అలాగే 15 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్నుడైన నాలుగో భారతీయుడిగా చోటు దక్కించుకున్న విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఆస్తి మొజాంబిక్ జిడిపి (14.7 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ. భారత్‌లోని అత్యంత సంపన్నులైన వంద మంది పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో ఈ ఏడాది ‘్ఫర్బ్స్’ విడుదల చేసిన జాబితాలో ముకేష్ అంబానీ తర్వాత సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ 16.9 బిలియన్ డాలర్ల సంపదతో ద్వితీయ స్థానంలో నిలువగా, 15.2 బిలియన్ డాలర్ల ఆస్తులతో హిందుజా కుటుంబం మూడవ స్థానంలోనూ, 13.9 బిలియన్ డాలర్ల ఆస్తులతో పల్లోంజీ మిస్ర్తి ఐదో స్థానంలోనూ నిలిచారు. భారీగా 83.7 బిలియన్ డాలర్లకు పెరిగిన ఈ ఐదుగురి మొత్తం ఆస్తులు అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ప్రభుత్వం చేపట్టిన ‘మంగళ్‌యాన్’ ప్రయోగాన్ని 1,230 సార్లు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువని, అలాగే ఈ ఏడాది బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఒలింపిక్ క్రీడల నిర్వహణకు చేసిన ఖర్చు కంటే వీరి ఆస్తులు 18 రెట్లకు పైగా ఎక్కువని ‘్ఫర్బ్స్ ఇండియా’ పత్రిక వివరించింది.

చిత్రం.. ఆర్‌ఐఎల్ అధినేత ముకేష్ అంబానీ