బిజినెస్

శ్రీసిటీని సందర్శించిన చైనా మొబైల్ ఉత్పత్తిదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ/సత్యవేడు, అక్టోబర్ 24: చైనాలోని మొబైల్ ఫోన్ ఇండస్ట్రీకి చెందిన 40 మంది ఉన్నత శ్రేణి ప్రతినిధుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో జరిగిన ఇండియా-చైనా మొబైల్ ఉత్పత్తిదారుల వస్తు ప్రదర్శనలో పాల్గొన్న ప్రతినిధుల బృందంలో కొందరు శ్రీసిటీకి విచ్చేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వీరికి సాదర స్వాగతం పలికారు. బిజినెస్ సెంటర్‌లో ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో శ్రీసిటీ వౌలిక వసతులను, పారిశ్రామిక ప్రగతిని ఆయన వివరించారు. ప్రపంచంలో మొబైల్‌ఫోన్ల వినియోగంలో భారత్ ముందుండగా, వాటి ఉత్పత్తిలో చైనా అగ్రగామిగా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో అత్యధిక మొబైల్ ఫోన్లు తయారుచేసే ఫాక్స్‌కాన్ సంస్థ శ్రీసిటీలో ఉండటం, తిరుపతి, చైనాలో మొబైల్ హబ్ ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతం మొబైల్ ఫోన్ల తయారీకి అనుకూలంగా ఉందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీసిటీలో అంతర్జాతీయ ప్రమాణాల వౌలిక వసతుల కారణంగా విదేశీ పరిశ్రమలు తమ పెట్టుబడులకు శ్రీసిటీనే ఎన్నుకుంటున్నాయని తెలిపారు. శ్రీసిటీలోని చైనాకు చెందిన ఫాక్స్‌కాన్, జడ్‌టిటి వంటి సంస్థల ప్రతినిధులు చైనాబృంద సభ్యులతో మాట్లాడుతూ పలు అనుకూల కారణాల వల్లే తమ ఉత్పత్తి కేంద్రాలను శ్రీసిటీలో స్థాపించినట్లు చెప్పారు. సమావేశం అనంతరం ప్రతినిధుల బృందం శ్రీసిటీలోని పలు చైనా పరిశ్రమలను సందర్శించింది.

చిత్రం.. శ్రీసిటీని సందర్శించిన చైనా బృందం