బిజినెస్

కారణాలు ఇవేనా?..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్ర్తి నాయకత్వ మార్పునకు ఎలాంటి కారణాలను ఇప్పటికిప్పుడు బోర్డు చెప్పలేదు. అయినప్పటికీ మిస్ర్తితో మాత్రం టాటా సన్స్ అసంతృప్తిగానే ఉందని చెప్పొచ్చు. లాభాలు లేని సంస్థల గురించి పట్టించుకోకపోవడం, లాభాలున్న సంస్థలపైనే దృష్టి సారించడం ఇందుకు కారణం. ముఖ్యంగా ఐరోపా ఉక్కు పరిశ్రమల్లో టాటా సన్స్‌కున్న చరిత్రే వేరు. అలాంటి చారిత్రక సంస్థ నేడు నిర్వీర్యం కావడం, దాని అభ్యున్నతికి మిస్ర్తి కృషి చేయకపోవడం టాటా సన్స్ జీర్ణించుకోలేకపోయింది. ఐరోపాలోని టాటా స్టీల్ సంక్షోభం అక్కడి ఆర్థిక వ్యవస్థనే కుదిపేసిందంటే అతిశయోక్తి కాదు. నిజానికి అన్ని రంగాల్లోనూ తమ వ్యాపారం ఉండాలన్నది, అదీ అగ్ర స్థానంలో వెలుగొందాలన్నది టాటా సన్స్ ప్రాథమిక సూత్రం. అలాంటిది మిస్ర్తి వచ్చాక పలు రంగాల్లో టాటా సన్స్ వైభవం తగ్గిపోవడం, కొన్నింటి నుంచైతే నిష్క్రమించే పరిస్థితులు రావడం కూడా మిస్ర్తి ఉద్వాసనకు కారణమేనని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.