బిజినెస్

మైక్రో-ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ.. మైక్రో-ఇన్సూరెన్స్ ఏజెంట్లకు పంటల బీమా పాలసీలను విక్రయించే అవకాశాన్ని కల్పించింది. దీంతో వారు ఇక ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, కొకనట్ పామ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తదితర పథకాలను మార్కెటింగ్ చేసుకోవచ్చు. మైక్రో-ఇన్సూరెన్స్ ఉత్పత్తుల్లో అవకతవకలు చోటుచేసుకుంటుండటంతో ప్రభుత్వం జారీచేసే పంటల బీమా పథకాలను అమ్మేందుకు వీలు కల్పించాలంటూ మైక్రో-ఇన్సూరెన్స్ ఏజెంట్లు పెట్టుకున్న అభ్యర్థన మేరకు ఐఆర్‌డిఎఐ తాజా నిర్ణయం తీసుకుంది.