బిజినెస్

మూడు వారాల గరిష్ఠానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 101.90 పాయింట్లు పెరిగి మూడు వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ 28,179.08 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 15.90 పాయింట్లు అందుకుని 8,708.95 వద్ద నిలిచింది. ఐరోపా మార్కెట్ల నుంచి అందుకున్న సానుకూల సంకేతాల మధ్య మదుపరులు కొనుగోళ్లకు ప్రాధాన్యమిచ్చారు. ఒఎన్‌జిసి షేర్ విలువ అత్యధికంగా 4.61 శాతం పెరిగితే, టాటా మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, కోల్ ఇండియా, లుపిన్, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, మారుతి సుజుకి, మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థల షేర్ల విలువలు 2.67 శాతం మేర లాభపడ్డాయి.
ఆయా రంగాలవారీగా చమురు, గ్యాస్ సూచీ 1.67 శాతం పెరిగితే, పిఎస్‌యు, ఆటో, బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్ల విలువ 1.54 శాతం నుంచి 0.20 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్ సూచీలు లాభపడగా, ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు కూడా పుంజుకున్నాయి.