బిజినెస్

ఆయనకు పూర్తి అధికారాలిచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 27: టాటా గ్రూపు చైర్మన్ పదవినుంచి అనూహ్య రీతిలో ఉద్వాసనకు గురయిన సైరస్ మిస్ర్తి తనను కీలుబొమ్మ చైర్మన్‌గా చేశారంటూ గ్రూపు యాజమాన్యంపై చేసిన ఆరోపణలను టాటా సన్స్ గురువారం తోసిపుచ్చుతూ గ్రూపు కంపెనీల నిర్వహణకు సంబంధించి మిస్ర్తికి పూర్తి అధికారాలు ఇచ్చామని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆయన బోర్డు విశ్వాసాన్ని కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. బోర్డు సభ్యులకు రాసిన లేఖను బహిర్గతం చేయడం ద్వారా మిస్ర్తి సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారని పేర్కొంది. మిస్ర్తి తన పదవీ కాలంలో టాటా గ్రూపు ఇంతకాలంగా పాటిస్తూ వస్తున్న విలువలు, సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారని కూడా టాటాసన్స్ ఆరోపించింది, ‘తనను కేవలం కీలుబొమ్మ చైర్మన్‌గా చేశారంటూ మిస్ర్తి చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదు., ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయనకు కంపెనీల నిర్వహణకు సంబంధించి పూర్తిఅధికారాలు కల్పించాం. అయినప్పటికీ ఆయన బోర్డు సభ్యుల విశ్వాసాన్ని కోల్పోవడం దురదృష్టకరం’ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మిస్ర్తిని చైర్మన్ పదవినుంచి తప్పించాలన్న నిర్ణయం బోర్డు సభ్యుల సమష్టి నిర్ణయమని కూడా స్పష్టం చేసింది.