బిజినెస్

టాటా కంపెనీలకు శరాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 27: టాటాగ్రూపులోని కొన్ని కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయంటూ గ్రూపు చైర్మన్ పదవినుంచి అర్ధంతరంగా తొలగించిన సైరస్ మిస్ర్తి చేసిన ప్రకటనతో వరసగా మూడో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లో ఆ గ్రూపునకు చెందిన కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఈ వారంలో ఆ గ్రూపునకు చెందిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.26,000 కోట్లు పడిపోయింది. ఒక్క టిసిఎస్ మినహా టాటా గ్రూపునకు చెందిన ప్రధాన కంపెనీల షేర్లు గురువారం కూడా నష్టపోయాయి. టాటా మోటార్స్ షేరు 1.44 శాతం పడిపోగా, టాటా పవర్ షేరు 1.36 వాతం టాటా స్టీల్ షేరు 0.44 శాతం పడిపోయింది. అయితే టిసిఎస్ మాత్రం స్వల్ప లాభాలతో ముగిసింది. టాటా టెలీ సర్వీసెస్ షేరు ఏకంగా 9 శాతానికి పైగా పడిపోగా, ఇండియన్ హోటల్స్, టాటా ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా గ్లోబల్ బెవరేజెస్ షేర్లు 5 శాతానికి పైగా నష్టపోయాయి. టాటా సన్స్‌లోని మిగతా కంపెనీల షేర్లు కూడా బాగానే నష్టపోయాయి. టాటా సన్స్‌కు చెందిన కొన్ని కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయంటూ సైరస్ మిస్ర్తి చేసిన ప్రకటనపై స్టాక్ ఎక్స్‌చేంజిలు బుధవారం రాత్రి కొన్ని కంపెనీలను వివరణ కోరిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా టాటాలు భాగస్వామిగా ఉన్న ఎయిర్ ఏసియాకు సంబంధించి మిస్ర్తి ఆరోపణలకు సంబందించిన పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, ఏదయినా చర్య తీసుకోదగ్గ అంశం తమ దృష్టికి వచ్చినట్లయితే చర్య తీసుకుంటామని పౌర విమానయాన శాఖ అంటోంది. ఇప్పటివరకు ఏ వర్గంనుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆ శాఖ కార్యదర్శి ఆర్‌ఎస్ చౌబే చెప్పారు. అనైతిక చర్యలకు పాల్పడిన ఎయిర్‌ఏసియాతో టాటా గ్రూపు జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంలో నైతికతను మిస్ర్తి ప్రశ్నించడం తెలిసిందే. ఎయిర్‌ఏసియా ఇండియాపై మిస్ర్తి చేసిన ఆరోపణల గురించి చౌబేను ప్రశ్నించగా, కొత్తగా ఏదయినా విషయం తమ దృష్టికి తెస్తే సంబంధిత అధికారులు వాటిని పరిశీలిస్తారని ఆయన చెప్పారు.