బిజినెస్

ఒఎన్‌జిసి లాభం 6 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రభుత్వ రంగ చమురు అనే్వషణ సంస్థ ఒఎన్‌జిసి నికర లాభాలు రెండో త్రైమాసికంలో ఆరుశాతం పెరిగాయి. కాగా, కంపెనీ తన లిక్విడిటీని పెంచుకోవడం కోసం ప్రతి రెండు షేర్లకు ఒక బోనస్ షేరును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 6.2 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో కంనీ నికర లాభం రూ.4,681.39 కోట్లు ఉండగా ఇప్పుడది 4,974.92 కోట్లకు పెరిగినట్లు కంపెనీ మార్కెట్ రెగ్యులేటర్ సెబికి దాఖలు చేసిన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా 5 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి రెండు షేర్లకు ఒక బోనసు షేరు జారీకి సైతం కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఆ ప్రకటన తెలిపింది. కంపెనీ వద్ద ఉండిన 14 వేల కోట్ల రూపాయల నగదును భవిష్యత్తు ప్రాజెక్టుల్లో, క్యాపిటల్ పెట్టుబడుల్లోను పెట్టుబడి పెట్టినందున కంపెనీ నగదు డివిడెండ్‌ను ప్రకటించడానికి బదులుగా బోనస్ షేరును జారీ చేయాలని భావించింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఒఎన్‌జిసిలో 5 శాతం వాటాలను విక్రయించడం ద్వారా దాదాపు 12,500 కోట్ల రూపాయలను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.