బిజినెస్

సింగరేణిలో సమ్మె సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 27: సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న పోరాటాలకు సింగరేణి యాజమాన్యంతోపాటు రాష్ట్రప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు రోజులు టోకెన్ సమ్మె నిర్వహించాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జెఎసి నిర్ణయించింది. ఈ నెల 17న సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన జెఎసి, దశల వారీ ఆందోళనా కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ల కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించింది. తరువాత సింగరేణి విస్తరించి ఉన్న ఆరుజిల్లాల కాంట్రాక్ట్ కార్మికులను సమీకరించి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానకార్యాలయం ఎదుట ఈ నెల 24వ తేదీన భారీ ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించక పోవడంతో నవంబర్ 10, 11వ తేదీల్లో రెండు రోజుల టోకెన్ సమ్మెకు జెఎసి పిలుపునిచ్చింది. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, హైపవర్ కమిటీ వేతనాలను అమలుచేయాలని, బోనస్ చెల్లించాలని తదితర 27 డిమాండ్లతో సింగరేణిలో సమ్మెకు కార్మికులను జెఎసి సిద్ధం చేస్తోంది.