బిజినెస్

ఆర్‌బిఐ ద్రవ్య సమీక్షే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రిజర్వ్ బ్యాంక్ మంగళవారం జరపనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఫలితం, విదేశీ పెట్టుబడుల రాకడ, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల అంచనాలు వచ్చే వారం స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. ఆర్‌బఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కంపెనీల త్రైమాసిక ఫలితాల అంచనాలు ఈ వారం ట్రేడంగ్ సెంటమెంట్‌ను ప్రభావితం చేస్తాయి. మదుపరులకు తదుపరి భారీ సంఘటన ఆర్‌బిఐ జరపబోయే ద్రవ్య పరపతి సమీక్ష. 2016-17 ఆర్థిక సంవత్సరానికి తన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విదానాన్ని రిజర్వ్ బ్యాంక్ మంగళవారం ప్రకటించనుంది. ద్రవ్య విధానం ఏ దశలో పయనించబోతోందనే దానికి రాబోయే ద్రవ్య సమీక్ష ఒక సంకేతంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. ఆర్‌బిఐ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో పాటుగా మదుపరులు కంపెనీల త్రైమాసిక రాబడులపైన కూడా పెద్ద ఆశలే పెట్టుకుని ఉన్నారని ఆయన చెప్పారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక ఆర్థిక ఫలితాలను బిహెచ్‌ఇఎల్ గురువారం ప్రకటించనుంది. ‘మార్కెట్లకు సంబంధించినంతవరకు కీలకమైన సంఘటన రిజర్వ్ బ్యాంక్ ప్రకటించబోయే ద్రవ్యపరపతి విధానం సమీక్షే. ఆర్‌బిఐ ద్రవ్య సమీక్ష, అంతర్జాతీయ మార్కెట్లలో ధోరణులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరల కదలకలు సమీప భవిష్యత్తులో మార్కెట్ ఏ తీరులో ఉండనుందో నిర్ణయించనున్నాయి’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ సంస్థ వ్యవస్థాపకుడు, సిఈఓ రోహిత్ గాడియా అన్నారు. అంతేకాకుండా సర్వీసులు, ఉత్పాదక రంగాలకు సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్ల సూచీ (పిఎంఐ) కూడా ఈ వారంలోనే వెలువడనుంది. కాగా, వరసగా నాలుగు వారాలుగా లాభాలతో ముగిసిన మార్కెట్లు గత వారం స్వల్ప నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. బిఎస్‌ఇ సెనె్సక్స్ 67.92 పాయింట్లు నష్టపోయి 25,269.64 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ కేవలం 3.45 పాయింట్లు కోల్పోయి 7,700 పాయింట్ల స్థాయిని నిలబెట్టుకోగలిగింది.